- హనుమకొండలో విషాద సంఘటన
- కాలేజీ వద్ద విద్యార్థి సంఘాల నిరసన
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని హన్మకొండ (Hanumakonda) నక్కలగుట్టలోని సువిద్య జూనియర్ కళాశాల (Suvidya Junior College) హాస్టల్లో గురువారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.
జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడునూతల గ్రామానికి చెందిన మురారిశెట్టి నాగజ్యోతి (Naga Jyoti) బుధవారం ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షకు హాజరై కళాశాల హాస్టల్‌కు చేరుకుంది. రాత్రి 9 గంటల సమయంలో తన రూంలో ఉరి వేసుకోగా మిత్రులు గమనించి కళాశాల యాజమాన్యానికి సమాచారం ఇచ్చారు.
వెంటనే నగరంలోని ఓ ప్రైవేట్ దవాఖానకి తరిలించి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే పరీక్ష సక్రమంగా రాయలేదనే కారణంతో ఆత్మహత్యచేసుకున్నట్లు చెబుతున్నప్పటికీ అసలు కారణం మాత్రం తెలియదు.
విద్యార్థి సంఘాల నిరసన
కాలేజీ హాస్టల్ లో నాగజ్యోతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై వివిధ విద్యార్థి సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. ఆత్మహత్యపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.