Inter Results |
- ఫస్ట్ ఇయర్‌లో 61.68 శాతం ఉత్తీర్ణత
- సెకండ్ ఇయర్‌లో 63.49 శాతం ఉత్తీర్ణత
- జూన్ 4 నుంచి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు
విధాత: తెలంగాణ ఇంటర్ ఫలితాలు (Intermediate Results )విడుదలయ్యాయి. మార్చి/ ఏప్రిల్‌లో నిర్వహించిన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పరీక్షల ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు.
ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో 61.68 శాతం, సెకండ్ ఇయర్ లో 63.49 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించాని చెప్పారు. జూన్ 4 నుంచి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని మంత్రి వెల్లడించారు.