Inter Results
విధాత: రాష్ట్రంలో ఇంటర్ ఫలితాల విడుదలకు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. ఫస్టియర్, సెకండియర్ ప్రశ్నపత్రాల మూల్యంకనం కొద్ది రోజుల క్రితమే పూర్తయింది.
ఇక మార్కుల విషయంలో ఎలాంటి తప్పులు దొర్లకుండా, గతంలో చోటు చేసుకున్న పరిణామాలు మళ్లీ పునరావృతం కాకుండా బోర్డు అధికారులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఒకటికి రెండుసార్లు విద్యార్థుల మార్కులను క్రాస్ చెక్ చేసుకుంటున్నారు.
అయితే ఇంటర్ ఫలితాలను 9 లేదా 10వ తేదీల్లో విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఒకేసారి విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 15 నుంచి ఏప్రిల్ 5 వరకు ఇంటర్ పరీక్షలు కొనసాగాయి. రెగ్యులర్, ఒకేషనల్ పరీక్షలకు దాదాపు ఐదు లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.