11న మున్సిపల్ కార్యాలయం ఎదుట రైతుల ధర్నా విధాత, నిజామాబాద్: మాస్టర్ ప్లాన్ రద్దు చేసి మున్సిపల్ సర్వ సభ్య సమావేశంలో తీర్మానం చేయాలని బీజేపీకి చెందిన కౌన్సిలర్లు మంగళవారం మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. ఇందుకోసం ఈ నెల 12న మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని వారు కోరారు. అదే విధంగా బుధవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ఐక్య కార్యాచరణ కమిటీ ధర్నాకు పిలుపునిచ్చింది. ఈ సందర్బంగా కౌన్సిల్ లో బీజేపీ […]

  • 11న మున్సిపల్ కార్యాలయం ఎదుట రైతుల ధర్నా

విధాత, నిజామాబాద్: మాస్టర్ ప్లాన్ రద్దు చేసి మున్సిపల్ సర్వ సభ్య సమావేశంలో తీర్మానం చేయాలని బీజేపీకి చెందిన కౌన్సిలర్లు మంగళవారం మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు.

ఇందుకోసం ఈ నెల 12న మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని వారు కోరారు. అదే విధంగా బుధవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ఐక్య కార్యాచరణ కమిటీ ధర్నాకు పిలుపునిచ్చింది. ఈ సందర్బంగా కౌన్సిల్ లో బీజేపీ ఫ్లోర్ లీడర్ మొటూరి శ్రీకాంత్ మాట్లాడారు.

రైతులకు నష్టం కలిగే విధంగా ఉన్న కామారెడ్డి పట్టణ మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇదే విషయమై తమ పార్టీ కౌన్సిలర్లు కమిషనర్‌కు వినతి పత్రం అందజేసిన‌ట్టు చెప్పారు. కామారెడ్డి కొత్త మాస్టర్ ప్లాన్ వల్ల నష్ట పోతున్న రైతులు సోమవారం అన్ని పార్టీల కౌన్సిలర్లకు మాస్టర్ ప్లాన్ ను రద్దు చేస్తూ 12వ తేదీన సర్వ సభ్య సమావేశం పెట్టి తీర్మానం చేయాలని కోరిన విషయాన్ని శ్రీకాంత్ గుర్తు చేశారు.

రైతులకు మద్దతుగా తాము కూడా కమిషనర్ ను కలసి వినతి పత్రం ఇచ్చామన్నారు. మాస్టర్ ప్లాన్ పై తీర్మానం చేసిన విషయాన్ని కలెక్టర్ కూడా మీడియా సమావేశంలో గుర్తు చేశారని, స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్దన్ మున్సిపల్ తీర్మానించిన ప్లాన్ డిటిసిపిలో మార్చినట్లు చెప్పారన్నారు.

మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తూ తీర్మానం అయ్యే వరకు తమ పార్టీ నాయకుడు వెంకటరమణారెడ్డి నాయకత్వంలో రైతులకు మద్దతుగా ఉద్యమంలో పాల్గొంటామని స్పష్టం చేశారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తూ కామారెడ్డి మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో తీర్మానం ప్రవేశ పెట్టాలని, రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని రైతు ఐక్య కార్యాచరణ కోరుతుంది.

ఈ మేరకు కమిటీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించే రైతు ధర్నా కార్యక్రమంలో అధిక సంఖ్యలో రైతులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కమిటీ ప్రతినిధులు కోరారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ధర్నా కొనసాగుతుందని వారు పేర్కొన్నారు.

Updated On 10 Jan 2023 4:15 PM GMT
krs

krs

Next Story