రూ.75కోట్లు మంజూరు చేస్తూ జీవో జారీ త్వ‌ర‌లో టెండ‌ర్లు పిలిచి శంకుస్థాప‌న‌ స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే, కలెక్టర్, కుడా చైర్మన్, బల్దియా కమిషనర్ విధాత, వరంగల్: వరంగల్ బస్ స్టేషన్ నిర్మాణాన్ని అన్ని హంగులతో అధునాతనంగా నిర్మించేందుకు స్థలాన్ని క్షేత్రస్థాయిలో మంగళవారం పరిశీలించారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, కలెక్టర్ డా. గోపి, కుడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, బల్దియా కమిషనర్ ప్రావీణ్య స్థ‌లాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వరంగల్ కలెక్టర్ డా. గోపి […]

  • రూ.75కోట్లు మంజూరు చేస్తూ జీవో జారీ
  • త్వ‌ర‌లో టెండ‌ర్లు పిలిచి శంకుస్థాప‌న‌
  • స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే, కలెక్టర్, కుడా చైర్మన్, బల్దియా కమిషనర్

విధాత, వరంగల్: వరంగల్ బస్ స్టేషన్ నిర్మాణాన్ని అన్ని హంగులతో అధునాతనంగా నిర్మించేందుకు స్థలాన్ని క్షేత్రస్థాయిలో మంగళవారం పరిశీలించారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, కలెక్టర్ డా. గోపి, కుడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, బల్దియా కమిషనర్ ప్రావీణ్య స్థ‌లాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా వరంగల్ కలెక్టర్ డా. గోపి మాట్లాడుతూ వరంగల్ బస్ స్టేషన్ నిర్మాణానికి క్షేత్రస్థాయిలో స్థ‌ల పరిశీలన చేశామన్నారు. నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.75 కోట్లు మంజూరు చేస్తూ జీవోను జారీ చేసింద‌ని, మోడ్రనైజింగ్ బస్ స్టేషన్ నిర్మాణానికి ప్లాన్ ను సిద్ధం చేసినట్లు చెప్పారు. త్వరలో టెండర్ ను పూర్తి చేసి శంకుస్థాపన చేస్తామని, బస్ స్టేషన్ పనులు జరిగే క్రమం లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా పరిశీలించామని తెలిపారు.

ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ వరంగల్ జిల్లాకే తలమానికంగా నిలిచేలా ఇక్కడ బస్ స్టేషన్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. రూ.75 కోట్ల వ్యయంతో ఆర్.టి.సి.బస్ స్టాండ్ నిర్మాణం తో పాటు, మ‌ల్టీ ఫ్లెక్స్ జోన్ ఏర్పాటు చేసి అందులో షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు కాబోతుందని చెప్పారు.

3 ఏకరాల స్థలంలో మోడల్ బస్ స్టేషన్ నిర్మించి, భవిష్యత్తులో వరంగల్ కు వచ్చే నియో మెట్రో రైలుకు అనుసంధానం చేస్తారని, కొత్తగా 32 ప్లాట్ ఫామ్ లు, 10 అంతస్తుల భవన నిర్మాణం, రెండు స్థాయిలలో పార్కింగ్ జోన్ లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

భవిష్యత్తులో వరంగల్ తూర్పు నియోజక వర్గం అంటే కేవలం కార్మికుల ఖర్ఖానాకే కాకుండా, భవిష్యత్తులో ఇక్కడికి ఐ.టి.పరిశ్రమలు, కంపెనీ లు రావడానికి ఇది తొలి అడుగని, ఇప్పటికే జిల్లా ఏర్పాటు జరిగిందని, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను, ప్రస్తుతం బస్ స్టాండ్ ను కూడా తెచ్చుకున్నట్లు చెప్పారు. దీని మీద ఆధారపడి జీవనం సాగించే కుటుంబాలకు, ఇక్కడే అవకాశాలు కల్పిస్తామని అన్నారు.

కుడా వైస్ చైర్మన్ సుందర్‌రాజు మాట్లాడుతూ నూతన బస్ స్టేషన్ నిర్మాణాన్ని చేపట్టడానికి ఉన్న బస్ స్టేషన్ ను తొలగించి ప్రస్తుతం తాత్కాలికంగా బస్ స్టేషన్ కొరకు ఎస్.ఎన్.ఎం క్లబ్, రైల్వే స్టేషన్ మధ్య గల స్థలాన్ని వినియోగించడం జరుగుతుందని తెలిపారు.

నైట్ హాల్ట్ బస్సులను నిలపడానికి " ఓ 'సిటిలోగల మైదానాన్ని వినియోగించుకుంటామని అన్నారు. హైదరాబాద్ తర్వాత నగరం వరంగల్‌ని, సింగపూర్, మలేసియా దేశాల్లో ఉండే బస్ స్టేషన్ ల తరహా లో అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా బస్ స్టేషన్ నిర్మాణం జరుగుతుందని అన్నారు.

కార్యక్రమం లో ఆర్.టి.సి.ఆర్.ఎం. శ్రీలత, బల్దియా ఎస్. ఈ .ప్రవీణ్ చంద్ర, కుడా సి.పి. ఓ.అజిత్ రెడ్డి, బల్దియా సిటీ ప్లానర్ వెంకన్న, ఈ. ఈ.లు భీమ్ రావు, శ్రీనివాస్, పోలీస్ అధికారులు, త‌దితరులు పాల్గొన్నారు.

Updated On 10 Jan 2023 2:50 PM GMT
krs

krs

Next Story