iPhone 15 | ఐఫోన్ 15 సిరీస్ ప్రీ బుకింగ్స్ శుక్రవారం నుంచి మొదలయ్యాయి. 15 సిరీస్ మొబైల్స్‌ను ఈ నెల 15న కాలిఫోర్నియాలో జరిగిన ‘వండర్‌లస్ట్’ ఈవెంట్‌లో లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఐఫోన్ 15 సిరీస్‌లో ఐఫోన్ 15, ఐ ఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐ ఫోన్ 15 ప్రో మాక్స్ మోడల్స్‌ను ప్రకటించింది. 15 నుంచి ఫ్రీ ఆర్డర్స్ మొదలవుతాయని చెప్పిన కంపెనీ.. 22 నుంచి సేల్స్ ప్రారంభమవుతాయని […]

iPhone 15 |
ఐఫోన్ 15 సిరీస్ ప్రీ బుకింగ్స్ శుక్రవారం నుంచి మొదలయ్యాయి. 15 సిరీస్ మొబైల్స్‌ను ఈ నెల 15న కాలిఫోర్నియాలో జరిగిన ‘వండర్‌లస్ట్’ ఈవెంట్‌లో లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఐఫోన్ 15 సిరీస్‌లో ఐఫోన్ 15, ఐ ఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐ ఫోన్ 15 ప్రో మాక్స్ మోడల్స్‌ను ప్రకటించింది. 15 నుంచి ఫ్రీ ఆర్డర్స్ మొదలవుతాయని చెప్పిన కంపెనీ.. 22 నుంచి సేల్స్ ప్రారంభమవుతాయని వెల్లడించింది.
కొత్త ఐఫోన్ 15 మోడల్స్‌లో డైనమిక్ ఐలాండ్, 48 ఎంపీ కెమెరా, ఏ 16 బయోనిక్ ఎస్ఓసీ తదితర ఫీచర్లు ఉన్నాయి. ఐ ఫోన్ 15 ప్రో మోడల్‌లో టైటానియం ఫ్రేమ్, టెలీ ఫోటో కెమెరా, యాక్షన్ బటన్ ఉండగా.. కొత్త 15 సిరీస్‌లో టైప్ ‘సీ’ యూఎస్‌బీ కేబుల్ సపోర్ట్ ఛార్జర్‌ను తీసుకువచ్చింది. ఇక ఐ ఫోన్స్ కావాలనుకుంటు యాపిల్ అధికారిక వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చు. భారత్ సహా దాదాపు 40 దేశాల్లో ప్రీ బుకింగ్స్ ఫెసిలిటీ ఉంటుందని కంపెనీ ప్రకటించింది.
ఐ ఫోన్ 15 సిరీస్ ఫోన్ల ధరలు ఇలా..
ఐఫోన్ 15 సిరీస్ ఫోన్ల ధరలను పరిశీలిస్తే అమెరికా కంటే అధికంగానే ఉన్నాయి. భారత్‌లో స్టాండర్డ్ ఐఫోన్ 15 రేటు 128 జీబీ వేరియంట్ మోడల్‌కు రూ.79,900 ఉన్నది. ఐఫోన్ 15 ప్లస్ రూ.89,900 ఉండగా.. ఈ రెండు ఫోన్లు కూడా 128 జీబీ, 256జీబీ, 512 జీబీ స్టోరేజ్‌తోనూ లభిస్తాయి. స్టోరేజ్ ఎక్కువ ఉంటే ధర కూడా పెరుగుతుంది. భారత్‌లో ఐఫోన్ 15 ప్రో 128 జీబీ వేరియంట్ రేటు రూ.1,34,900 కంపెనీ నిర్ణయించింది.
ఐఫోన్ 15 ప్రో లో 128 జీబీ, 256జీబీ, 512 జీబీ స్టోరేజ్ ఆప్షన్స్‌తో పాటు టీబీ స్టోరేజ్ ఫెసిలిటీ సైతం ఉన్నది. అయితే, ఐఫోన్ 15 ప్రో మాక్స్ రేటు గణనీయంగా పెరిగింది. ఐఫోన్ 15 ప్రో మాక్స్ 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,59,900 ఉన్నది. ఐఫోన్ 15 ప్రో మాక్స్‌లో 128 జీబీ స్టోరేజ్ అందుబాటులో లేదు. కేవలం 256జీబీ, 512 జీబీ, వన్ టీబీ స్టోరేజ్ ఆప్షన్‌తోనే ఉంటుంది.
ప్రీ బుకింగ్ ఇలా చేసుకోవాలి..?
ఐ ఫోన్ 15 సిరీస్ ఫోన్‌ను కొనుగోలు చేయాలని భావిస్తున్న వారు ప్రీ బుకింగ్ చేసుకునేందుకు ముందుగా ఆపిల్ అధికారిక వెబ్‌సైటకి వెళ్లాలి. డ్రాప్ డౌన్ మెన్యూలో ‘షాప్’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఐ ఫోన్ 15 సిరీస్ ఏ మోడల్‌ను తీసుకోవాలనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకోవాలి. మీ పాత ఫోన్‌తో మార్చుకోవాలను కుంటే.. ట్రేడింగ్ ఆప్షన్‌కు వెళ్లాలి.
ఆపిల్ కేర్ ప్లస్ కవరేజ్ కావాలనుకుంటే ఆపిల్ కేర్ ప్లస్ కవరేజ్‌ను ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత పేజీలోకి పేరు, మొబైల్ నంబర్, ఈ మెయిల్, డెలివరీ అడ్రస్, మోడ్ ఆఫ్ డెలివరీ చెప్పాలి. తర్వాత పేమెంట్ చేయాలి. దాంతో ప్రీ ఆర్డర్ బుక్ అయినట్లే. ఆ తర్వాత మీకు ఓ కన్ఫర్మేషన్ ఈ మెయిల్ వస్తుంది.
