IPL-2023 | ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో బెంగళూరు రాయల్స్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీకి జరిమానా విధించారు. ఆదివారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనలు అధిగమించేందుకు కోహ్లీకి, టీమ్ సభ్యులకు భారీ జరిమానా విధించింది.
ఆర్‌ఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా విధించింది. లీగ్‌లో ఆర్‌సీబీ టీమ్ స్లో ఓవర్ రేట్ నమోదు కావడం ఇది రెండోసారి. దాంతో విరాట్‌కు ఏకంగా రూ.24లక్షల జరిమానా విధించింది. అలాగే టీమ్ సభ్యులకు రూ.6లక్షలు లేదంటే.. మ్యాచ్ ఫీజులో 25శాతం (రెండింటిలో ఏది ఎక్కువైతే అది) కోత విధిస్తూ మ్యాచ్ రిఫరీ నిర్ణయం తీసుకున్నారు.
ఇదిలా ఉండగా.. ఈ సీజన్‌లో మరోసారి ఏదైనా తప్పు జరిగే మ్యాచ్‌లో ఎవరు కెప్టెన్‌గా ఉన్నా అతనిపై రెండు మ్యాచ్‌ల వరకు నిషేధం విధించే అవకాశం ఉంటుంది. గతంలో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ స్లో ఓవర్ రేట్ నమోదైంది.
ఆ మ్యాచ్‌లో బౌలింగ్ నెమ్మదిగా సాగడంతో ఐపీఎల్ యాజమాన్యం కెప్టెన్ డుప్లెసిస్‌కు జరిమానా విధించింది. తొలి తప్పుకింద రూ.12 లక్షలు జరిమానా విధించింది. ఐపీఎల్ ఈ సీజన్‌లో బెంగళూరు ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లు ఆడి నాలుగు విజయాలతో పాయింట్ల టేబుల్‌లో ఐదో స్థానంలో కొనసాగుతున్నది.