IPL-2023 | ఇండియన్ ప్రీమియర్ (IPL) -2023 సీజన్ శుక్రవారం అట్టహాసంగా ప్రారంభంకానున్నది. పది జట్లు టైటిల్ కోసం బరిలోకి దిగనున్నాయి. తొలి మ్యాచ్ డిపెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ నాలుగుసార్లు విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనున్నది.
ప్రారంభమైన గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగనున్నది. తొలి మ్యాచ్‌లో వెటరన్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, యువ క్రికెటర్ హార్దిక్ పాండ్యా బరిలోకి దిగనున్నారు. ధోనీ తన కెప్టెన్సీలో చెన్నైని నాలుగుసార్లు ఛాంపియన్‌గా నిలిపాడు. గుజరాత్ గతేడాది తొలి సీజన్‌లోనే హార్దిక్ జట్టును విజేతగా నిలిపాడు.
ప్రారంభ వేడుకల్లో మెరువనున్న మిల్కీ బ్యూటీ తమన్నా
శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభవేడుకలు అట్టహాసంగా మొదలవనున్నాయి. బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు సందడి చేశారు. మిల్కీ బ్యూటీ తమన్నా, సింగర్ అరిజిత్ సింగ్ సందడి చేయనున్నట్లు ఐపీఎల్ ధ్రువీకరించింది. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా సైతం హాటల్ ఫర్ఫామెన్స్ ఇవ్వబోతున్నట్లుగా ప్రచారం జరిగినా ఐపీఎల్ మాత్రం ఇంకా ధ్రువీకరించలేదు.
అలాగే బాలీవుడ్ నటి కత్రినా కైఫ్, హీరోగా టైగర్ ష్రాఫ్ సైతం మెరువనున్నట్లు ప్రచారం జరిగినా అధికారికంగా ప్రకటించలేదు. ఇంతకు ముందు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ వేడుకలో నటీమణులు కృతి సనన్, కియారా అద్వానీ, పాప్ సింగర్ ఏపీ ధిల్లాన్ ప్రదర్శన ఇచ్చారు.
ఇదిలా ఉండగా.. ఈ సీజన్‌లో ఐపీఎల్‌లో తెలుగులో నందమూరి బాలకృష్ణ సందడి చేయనున్నారు. ఇప్పటికే హీరోగా, షోకు హోస్ట్‌గా అలరిస్తున్న నందమూరి నటసింహం.. తొలిసారిగా కామెంటర్‌గా అదరగొట్టేందుకు సిద్ధమయ్యారు. మార్చి 31న ప్రారంభమయ్యే ఐపీఎల్ ఓపెనింగ్ రోజున బాలకృష్ణ కామెంటరీ స్టార్‌స్పోర్ట్స్ ప్రకటించింది.
దాదాపు రెండేళ్ల తర్వాత..
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఫ్రాంచైజీలు దాదాపు రెండేళ్ల తర్వాత సొంత స్టేడియాల్లో మ్యాచ్‌లు ఆడనున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా తటస్థ వేదికల్లో మ్యాచ్‌లు ఆడాయి. అయితే, ఈ సారి ప్రతిజట్టు ఐపీఎల్ ఫ్రాంచైజీ సొంత మైదానంతో పాటు.. ప్రత్యర్థి మైదానంలోనూ మ్యాచులు జరగనున్నాయి.
2021 సీజన్ కొన్ని మ్యాచులు రెండు విడుతల్లో భారత్‌తో పాటు దుబాయిలో జరిగాయి. 2022 సీజన్‌లో ముంబయి, గుజరాత్, పశ్చిమ బెంగాల్‌లో మ్యాచ్‌లు జరిగాయి. ఈ సారి సొంత మైదానాల్లో పోటీలు జరుగనుండడం పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చే అవకాశం ఉన్నది.