HomelatestIPL-2023 | సీజన్‌ ప్రారంభానికి ముందై చెన్నై సూపర్‌ కింగ్స్‌కు షాక్‌..! ఐపీఎల్‌కు పేసర్‌ కైల్‌...

IPL-2023 | సీజన్‌ ప్రారంభానికి ముందై చెన్నై సూపర్‌ కింగ్స్‌కు షాక్‌..! ఐపీఎల్‌కు పేసర్‌ కైల్‌ జేమన్స్‌ దూరం..

IPL-2023 | ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఈ నెల 31 నుంచి ప్రారంభంకానున్నది. తొలి మ్యాచ్‌లో నాలుగుసార్లు ఛాంపియన్‌లగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్, డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌తో తలపడనున్నది. ఈ మ్యాచ్‌కు ముందే సీఎస్‌కే జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది.

న్యూజిలాండ్‌ బౌలర్‌ కైల్‌ జేమ్సన్‌ ఐపీఎల్‌ 16వ సీజన్‌కు దూరమయ్యాడు. ఈ ఏడాది మినీ వేలంలో రూ.కోటి సీఎస్‌కే కొనుగోలు చేసింది. జేమ్సన్ చాలా కాలంగా గాయపడ్డాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌కు దూరమయ్యాడు.

అతని స్థానంలో దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ సిసంద మగలాను జట్టులోకి తీసుకుంది. దక్షిణాఫ్రికా తరఫున ఇప్పటి వరకు నాలుగు టీ20లు మాత్రమే ఆడినా.. దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఐపీఎల్‌లో రూ.50లక్షల బేస్‌ ప్రైస్‌తో సీఎస్‌కేలో చేరనున్నాడు.

దక్షిణాఫ్రికా తరఫున నాలుగు టీ20ల్లో మూడు వికెట్లు పడగొట్టి.. ఐదు వన్డేల్లో ఆరు వికెట్లు తీశాడు. ఇప్పటి వరకు ఆడిన 127 టీ20 మ్యాచుల్లో 136 వికెట్ల తీశాడు. ఇందులో 20 పరుగులు ఇచ్చి ఐదు వికెట్ల తీశాడు. అదే సమయంలో బ్యాటింగ్‌తోనూ రాణిస్తున్నాడు. 127 టీ20ల్లో 17.50 సగటుతో 735 పరుగులు చేశాడు. 123.52 స్ట్రయిక్‌ రేట్‌తో రెండు అర్థ సెంచరీలు సైతం సాధించాడు.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular