fifa: విధాత: వినటానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజం. ఇరాన్‌లో తమ దేశ ఫుట్‌బాల్‌ జట్టు ఓడిపోయినందుకు సంబ‌రాలు జరుపుకున్నారు. ఖతార్‌లో జరుగుతున్న ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌ టోర్నీలో ఇంగ్లండ్‌ చేతిలో ఇరాన్‌ ఓడిపోయింది. దీంతో దేశవ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి ప్రదర్శనలు నిర్వహించారు. ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ ప్రతినిధిగా పాల్గొన్న జట్టు ఓడిపోవటం సంతోషించ దగిందేనని అంటున్నారు. ఈ సందర్భంగా పోలీసులు రెచ్చిపోయి ఓ ప్రదర్శన కారుని తలపై తుపాకీ గురిపెట్టి కాల్చి చంపారు. ఇరాన్‌లో […]

fifa: విధాత: వినటానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజం. ఇరాన్‌లో తమ దేశ ఫుట్‌బాల్‌ జట్టు ఓడిపోయినందుకు సంబ‌రాలు జరుపుకున్నారు. ఖతార్‌లో జరుగుతున్న ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌ టోర్నీలో ఇంగ్లండ్‌ చేతిలో ఇరాన్‌ ఓడిపోయింది. దీంతో దేశవ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి ప్రదర్శనలు నిర్వహించారు. ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ ప్రతినిధిగా పాల్గొన్న జట్టు ఓడిపోవటం సంతోషించ దగిందేనని అంటున్నారు. ఈ సందర్భంగా పోలీసులు రెచ్చిపోయి ఓ ప్రదర్శన కారుని తలపై తుపాకీ గురిపెట్టి కాల్చి చంపారు.

ఇరాన్‌లో గత 10 వారాలుగా నిరసనోద్యమాలు కొనసాగుతున్నాయి. మాసా అమిని అనే 22ఏండ్ల యువతిని తలపై హిజాబ్‌ సరిగా ధరించలేదని ఇరాన్ నైతిక పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. మోరల్‌ పోలీసులు ఆమెను తీవ్రంగా హింసించటంతో ఆమె చనిపోయిన ఘటన దేశవ్యాప్త ఉద్యమానికి కారణమైంది. ఇరాన్‌ పాలకుల అమానవీయ విధానాలను నిరసిస్తూ దేశ వ్యప్తంగా మహిళలు రోడ్లెక్కారు.

ఇరాన్‌ ప్రభుత్వం ఈ ఉద్యమాన్ని పాశ్చాత్య దేశాల కుట్రగా చెప్తూ ఉద్యమాన్ని కిరాయి అల్లర్లుగా చిత్రీకరిస్తున్నది. నిరసనోద్యమంపై తీవ్ర అణిచివేతను ప్రయోగిస్తున్నది. ఇప్పటికే 448 మంది మృతిచెందారు. 18వేల మంది జైళ్లలో నిర్బంధింపబడ్డారు. అయినా… ప్రజలు ఏ చిన్న అవకాశాన్ని వదలకుండా ఉద్యమానికి వనరుగా వాడుకోవటం ప్రజాకాంక్షల తీవ్రతకు అద్దం పడుతున్నది.

Updated On 1 Dec 2022 2:41 PM GMT
krs

krs

Next Story