IRCTC | చాలా మంది కుటుంబాలు, స్నేహితులు, ఇరుగుపొరుగు వారితో కలిసి విహార యాత్రలకు వెళ్లాలనుకుంటారు. శుభకార్యాల నేపథ్యంలో వివిధ ప్రాంతాలకు బంధుగణంతో వెళ్లాలనుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో జనం వెళ్లేందుకు ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది. అయితే, విహార యాత్రలు, పెళ్లిళ్లు, ఇతర శుభాకార్యాలకు వెళ్లే సమయలో రైలును బుక్ చేసుకునే ప్రయాణికులు రైల్వే బోగిలను బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నది. దీనిపై చాలామందికి అవగాహన ఉండదు. దీన్ని ఫుల్ టారిఫ్ రేట్ సర్వీస్‌గా పిలుస్తుంటారు. ఫుల్ టారిఫ్ […]

IRCTC | చాలా మంది కుటుంబాలు, స్నేహితులు, ఇరుగుపొరుగు వారితో కలిసి విహార యాత్రలకు వెళ్లాలనుకుంటారు. శుభకార్యాల నేపథ్యంలో వివిధ ప్రాంతాలకు బంధుగణంతో వెళ్లాలనుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో జనం వెళ్లేందుకు ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది. అయితే, విహార యాత్రలు, పెళ్లిళ్లు, ఇతర శుభాకార్యాలకు వెళ్లే సమయలో రైలును బుక్ చేసుకునే ప్రయాణికులు రైల్వే బోగిలను బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నది.
దీనిపై చాలామందికి అవగాహన ఉండదు. దీన్ని ఫుల్ టారిఫ్ రేట్ సర్వీస్‌గా పిలుస్తుంటారు. ఫుల్ టారిఫ్ రేట్ సర్వీస్‌ను ప్రయాణీకులతో పాటు సంస్థలు సైతం ఎఫ్‌టీఆర్ వెబ్‌సైట్ ద్వారా రైలును లేదంటే.. కోచ్‌లను సైతం బుక్ చేసుకునే వీలున్నది పేర్కొంది. FTR రైలు ఆన్‌లైన్ బుకింగ్ చేస్తే రైల్వే డివిజన్ల స్టేషన్ల నుంచి ప్రయాణించే వీలుంటుంది. రైలు పది నిమిషాలు అంతకంటే ఎక్కువ సేపు ఆగిన స్టేషన్లలో మాత్రమే కోచ్‌లను వేరు చేసి రైలుకు జోడిస్తూ వస్తుంటారు. అన్ని రైళ్లలో కోచ్‌లను జోడించడం వీలుకాకపోవచ్చు. అయితే, బుకింగ్ గరిష్ఠంగా ఆరు నెలల ముందు.. లేదంటే ప్రయాణానికి కనీసం 30 రోజుల ముందైనా బుక్ చేసుకునే వీలుంటుంది.
ప్రత్యేకంగా టూర్ కోసం ఓ రైలును గరిష్ఠంగా పది కోచ్‌లు బుక్ చేసుకోవచ్చు. రైలు కోసం రెండు స్లీపర్ కోచ్‌లతో సహా గరిష్ఠంగా 24 కోచ్‌లను బుక్ చేసుకునే వీలుంటుంది. ఏడు రోజుల ప్రయాణానికి కోచ్‌ను బుక్ చేసుకునేందుకు ఒక్కో కోచ్‌కు రూ.50వేలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రయాణం పొడిగించే అవకాశం ఉంటే.. ప్రతి రోజుకు అదనంగా ఒక్కో కోచ్‌కు రూ.10వేలు చెల్లించాల్సి ఉంటుంది. రైలును బుక్ చేసుకోవడానికి ఏడు రోజుల ప్రయాణానికి కనీసం 18 కోచ్‌లను బుక్ చేసుకునేందుకు రూ.9లక్షలను చెల్లించాల్సి ఉంటుంది. 18 కోచ్‌లకు మించి ఒక్కో కోచ్‌కు రూ.50వేల చొప్పున అదనంగా చెల్లించాల్సి వస్తుంది.
ఏడు రోజుల ప్రయాణానికి మించితే ఒక్కో కోచ్‌కు రూ.10వేల చొప్పున కట్టాల్సి ఉంటుంది. అయితే, పూర్తి బోగిని బుక్ చేసుకోవాలనుకుంటే మొదట రైల్వే కార్యాలయంలో చీఫ్ బుకింగ్ సూపర్‌వైజర్‌ని సంప్రదించాలి. ప్రయాణ వివరాలతో కూడిన రాతపూర్వకంగా దరఖాస్తు ఇవ్వాలి. సిస్టమ్ జనరేటెడ్ స్లిప్ తీసుకొని యూటీఎస్ కౌంటర్‌కు వెళ్లి.. డబ్బులు జమ చేసి రసీదు తీసుకోవాలి. బుకింగ్ కన్ఫామ్ అయిన తర్వాత, రైలు బయల్దేరే స్టేషన్ మేనేజర్‌కు ప్రయాణికుల జాబితా ఇవ్వాల్సి ఉంటుంది.
ftr.irctc.co.in వెబ్‌సైట్‌లోనూ రైలును బుక్ చేసుకునే వీలున్నది. అయితే, రైలు, కోచ్‌లను బుక్ చేసుకునే వారికి ఐఆర్‌సీటీసీ శుభవార్త చెప్పింది. ఇందులో బుక్ చేసుకున్న రైళ్లలోని కోచ్‌లలో క్యాటరింగ్ సదుపాయం కల్పించబోతున్నది. ప్రత్యేక కోచ్‌లు, రైళ్లలో క్యాటరింగ్ సౌకర్యాలను ఐఆర్‌సీటీసీ అందించబోతున్నది. ప్రత్యేక కోచ్‌లు, రైళ్లలో క్యాటరింగ్ సౌకర్యలను కేవలం ఐఆర్‌సీటీసీ ద్వారా బుక్ చేసుకోవచ్చని రైల్వే పేర్కొంది.
