IRCTC Ooty Tour | మరో వైపు సెలవులు దగ్గరపడుతున్నాయి. వేసవిలో ఎండలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలో చాలా మంది చల్లటి ప్రాంతాల్లో పర్యటించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో అలాంటివారి కోసం ఐఆర్‌సీటీసీ స్పెషల్ ప్యాకేజీని తీసుకువచ్చింది. మనకు దగ్గరలో ఉన్న తమిళనాడులోని ఊటీ సుందరమైన పర్యాటక ప్రదేశం.
ఇక్కడున్న పచ్చిక బయళ్లు, ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రకృతి రమణీయత అందరినీ ఆకర్షిస్తాయి. అలాగే హిల్ స్టేషన్ల రాణి పిలుచుకునే ఊటీని సందర్శించేందుకు ఈ ప్యాకేజీని తెచ్చింది. ఊటీతో పాటు కూనూర్ తదితర ప్రదేశాలను ఇందులో చుట్టిరావొచ్చు.
పర్యాటకులు ఈ ప్యాకేజీలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, హిల్ స్టేషన్లు, ఇతర పర్యాటక ప్రత్యేక రైళ్లను నడుపుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఐఆర్‌సీటీసీ ఊటీ టూర్ కోసం 5 రాత్రులు, 6 పగళ్ల స్పెషల్ టూర్ ప్యాకేజీని అందుబాటులో ఉంచింది.
పర్యటన సాగుతుంది ఇలా..
ఐఆర్‌సీటీసీ అల్టిమేట్ ఊటీ ఎక్స్ హైదరాబాద్ ( ULTIMATE OOTY EX HYDERABAD) పేరుతో ప్యాకేజీని ప్రకటించింది. ప్రతి మంగళవారం అందుబాటులో ఉండనున్నది. తొలి రోజు శబరి ఎక్స్‌ప్రెస్ (17230) సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి మధ్యాహ్నం 12.20 గంటలకు బయలుదేరుతుంది. ఆ రోజంతా ప్రయాణం సాగుతుంది. రెండో రోజు ఉదయం 08.02 గంటలకు కోయంబత్తూరు చేరుకుంటారు.
అక్కడి నుంచి ఊటీకి వెళ్లి, హోటల్‌లో చెకిన్ అవుతారు. మధ్యాహ్నం బొటానికల్ గార్డెన్స్, ఊటీని సందర్శించి.. రాత్రి అక్కడే బస చేస్తారు. మూడో రోజు ఉదయం అల్పాహారం పూర్తి చేసుకొని దొడబెట్ట శిఖరం, టీ మ్యూజియం, పైకారా జలపాతం వీక్షిస్తారు. రాత్రి ఊటీలోనే బస ఉంటుంది. నాలుగో రోజు హోటల్‌లోనే అల్పాహారం పూర్తి చేసుకొని కొన్నూర్ పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించి మధ్యాహ్నం ఊటికి చేరుకుంటారు. రాత్రి ఊటీలోనే బస ఉంటుంది.
ఐదో రోజు మధ్యాహ్నం హోటల్ నుంచి చెక్ అవుట్ చేసి కోయంబత్తూరుకు బయలుదేరాల్సి ఉంటుంది. రైల్వేస్టేషన్‌లో సాయంత్రం 4.35 గంటలకు మళ్లీ శబరి ఎక్స్‌ప్రెస్‌లో తిరు ప్రయాణమవుతారు. ఆరో రోజు మధ్యాహ్నం 12.20 గంటలకు రైలు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకోవడం పర్యటన ముగుస్తుంది.
ప్యాకేజీ ధరలు ఇలా..
ఐఆర్‌సీటీసీ పలు రకాల ప్యాకేజీలను అందుబాటులో ఉంచింది. ప్యాకేజీలో ఒకరి నుంచి ముగ్గురు పర్యాటకులు టికెట్ బుక్ చేసుకుంటున్న కంఫర్ట్ కేటగిరిలో సింగిల్ షేరింగ్‌కు రూ.27,700, ట్విన్ షేరింగ్‌కు రూ.15,820, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.12,830, 5-11 ఏళ్లలోపు పిల్లలకు బెర్త్‌తో కలిసి రూ.9,540 చెల్లించాల్సి ఉంటుంది. స్టాండర్డ్ కేటగిరిలో రూ.25,240, ట్విన్ షేరింగ్‌లో రూ.13,360, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.10,370, పిల్లలకు బెర్త్‌తో కలిసి రూ.7090 ధర నిర్ణయించింది.
నాలుగు నుంచి ఆరుగురు పర్యాటకులు బుక్ చేసుకుంటే కంఫర్ట్ కేటగిరిలో ట్విన్ షేరింగ్‌లో రూ.14,810, ట్రిపుల్ షేరింగ్‌లో రూ.11,740, పిల్లలకు రూ.9540, స్టాండర్డ్ కేటగిరిలో ట్విన్ షేరింగ్‌లో రూ.11,720, ట్రిపుల్ షేరింగ్‌లో రూ.9280, పిల్లలకు రూ.7090 చెల్లించాల్సి ఉంది.
కంఫర్ట్ కేటగిరిలో థర్డ్, స్టాండర్డ్ కేటగిరిలో స్లీపర్ కేటగిరిలో ప్రయాణం ఉంటుంది. రైలు ప్రయాణం, ఏసీ వాహన సదుపాయం, ఏసీ హోటల్‌లో వసతి, ఇన్సూరెన్స్ ప్యాకేజీలోనే కవర్ అవుతాయి. వివరాలకు irctctourism.com వెబ్‌సైట్‌లో సంప్రదించవచ్చు.
Read Also : IRCTC Tourism | షిర్డీ సాయిబాబా భక్తులకు గుడ్‌న్యూస్..! హైదరాబాద్ నుంచి రూ.3370 ప్యాకేజీని ప్రకటించిన ఐఆర్‌సీటీసీ..!
Read Also : Vande Bharat Express | హైదరాబాద్‌కు మరో వందే భారత్ రైలు..! నాగ్‌పూర్ – సికింద్రాబాద్ మధ్య సెమీ హైస్పీడ్ రైలు..!!
Read Also : Vande Metro | త్వరలో పట్టాలెక్కనున్న వందే మెట్రో..! రైలు ఎలా ఉండబోతుందంటే..?