IRCTC Temple Run Package | కుటుంబంతో కలిసి వివిధ దక్షిణ భారతంలో ఉన్న ప్రముఖ ఆలయాలను సందర్శించుకోవాలనుకునే పర్యాటకుల కోసం ఐఆర్‌సీటీసీ మరో బంపర్‌ ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీలో కేరళలోని ప్రముఖ ఆలయాలను చుట్టి వచ్చేందుకు అవకాశం ఉన్నది. ఆరు రాత్రులు, ఏడు పగళ్లు ఉండే ఈ యాత్రలో కన్యాకుమారి, మధురై, రామేశ్వరం, తిరుచ్చి, త్రివేండ్రం తదితర ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు అవకాశం ఉన్నది. ఇందుకోసం ‘సౌత్‌ ఇండియా టెంపు రన్‌’ పేరుతో […]

IRCTC Temple Run Package |

కుటుంబంతో కలిసి వివిధ దక్షిణ భారతంలో ఉన్న ప్రముఖ ఆలయాలను సందర్శించుకోవాలనుకునే పర్యాటకుల కోసం ఐఆర్‌సీటీసీ మరో బంపర్‌ ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీలో కేరళలోని ప్రముఖ ఆలయాలను చుట్టి వచ్చేందుకు అవకాశం ఉన్నది. ఆరు రాత్రులు, ఏడు పగళ్లు ఉండే ఈ యాత్రలో కన్యాకుమారి, మధురై, రామేశ్వరం, తిరుచ్చి, త్రివేండ్రం తదితర ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు అవకాశం ఉన్నది.

ఇందుకోసం ‘సౌత్‌ ఇండియా టెంపు రన్‌’ పేరుతో ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. ఇందులో కేవలం విమానంలోనే పర్యటన ఉంటుంది. ఏడు రోజులు, ఆరు రాత్రుల పాటు పర్యటన కొనసాగుతుంది. నవంబర్‌ ఒకటో తేదీన పర్యటన మొదలవుతుంది.హైదరాబాద్‌ నుంచి ప్రారంభమయ్యే ఈ ప్యాకేజీ ధరను రూ.32.250గా నిర్ణయించింది.

పర్యటన సాగుతుంది ఇలా..

Day 1 | నవంబర్‌ ఒకటిన ఉదయం హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంత్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరుతారు. త్రివేండ్రం చేరుకొని.. హోటల్‌కు వెళ్లారు. అక్కడ అల్పాహారం పూర్తీ చేసుకొని మొదట నేపియర్ మ్యూజియం సందర్శిస్తారు. మధ్యాహ్నం పూవార్ ద్వీపాన్ని, సాయంత్రం అజిమల శివాలయాన్ని సందర్శనకు వెళ్తారు. రాత్రికి త్రివేండ్రంలోనే బస చేయాల్సి ఉంటుంది.

Day 2 | రెండోరోజు ఉదయం తిరువనంతపురంలోని పద్మనాభస్వామి ఆలయానికి వెళ్తారు. ఆ తర్వాత కన్యాకుమారికి చేరుకొని సన్‌సెట్‌ పాయింట్‌ను సందర్శిస్తారు. రాత్రికి కన్యాకుమారిలోనే బస ఉంటుంది.

Day 3 | మూడోరోజు ఉదయం అల్పాహారం పూర్తి చేసుకొని రాక్ మెమోరియల్‌ను సందర్శిస్తారు. అనంతరం రామేశ్వరం బయలుదేరి వెళ్తారు. ఇందుకు ఐదు నుంచి ఆరు గంటల సమయం పడుతుంది. హోటల్‌కు చెకిన్‌ అయ్యి.. రాత్రి రామేశ్వరంలోనే బస ఉంటుంది.

Day 4 | ఉదయం రామేశ్వరం ఆలయ దర్శనం ఉంటుంది. ఆ తర్వాత ధనుష్కోడికి వెళ్తారు. బస్సులు రామేశ్వరం లోపలకు అనుమతి ఉండదు. స్థానిక ఆలయాల సందర్శనకు స్థానికంగా ఉన్న వాహనాల్లోనే సొంత ఖర్చులతో సందర్శనకు వెళ్లాల్సి ఉంటుంది. ఆలయాల సందర్శన అనంతరం రాత్రికి రామేశ్వరంలోనే బస ఉంటుంది.

Day 5 | ఐదోరోజు ఉదయం అల్పాహారం పూర్తయ్యాక అబ్దుల్‌ కలాం మెమెరియల్‌ సందర్శన ఉంటుంది. ఆ తర్వాత తంజావూరుకు బయలుదేరి వెళ్తారు. అక్కడ బృహదీశ్వర ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం తిరుచ్చికి బయలుదేరుతారు. రాత్రి అక్కడే బస ఉంటుంది.

Day 6 | ఉదయం అల్పాహారం పూర్తి చేసుకొని శ్రీరంగం ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం మధురైకి బయలుదేరి వెళ్తారు. మూడు గంటల ప్రయాణం ఉంటుంది. రాత్రికి మధురైకి చేరుకొని అక్కడే బస చేస్తారు.

Day 7 | ఏడో రోజు అల్పాహారం పూర్తయ్యాక మీనాక్షి అమ్మవారి ఆలయ సందర్శనకు వెళ్తారు. అనంతరం మధురై విమానాశ్రయానికి చేరుకొని.. అక్కడి నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు. దీంతో సౌత్‌ ఇండియా టెంపుల్‌ రన్‌ ప్యాకేజీ పర్యటన ముగుస్తుంది.

ప్యాకేజీ ఇలా..

హైదరాబాద్ నుంచి విమానంలో పర్యాటకులను తీసుకెళ్తారు. హోటల్‌ సింగిల్‌ రూం కావాలనుకునే వారు రూ.50,350 చెల్లించాల్సి ఉంటుంది. డబుల్‌ షేరింగ్‌కు రూ.37,650, ట్రిపుల్‌ షేరింగ్‌కు రూ.35,950 చెల్లించాల్సి ఉంటుంది. ఐదేళ్ల నుంచి 11 సంవత్సరాల పిల్లలకు సైతం ప్రత్యేకంగా ధర నిర్ణయించారు.

ప్రత్యేకంగా బెడ్‌ అవసరమైతే రూ.31,500.. బెడ్‌ లేకపోతే రూ.57,750 చెల్లించాల్సి ఉంటుంది. 2 నుంచి నాలుగేళ్ల పిల్లలకు రూ.20,350 వసూలు చేస్తారు. ప్యాకేజీలో విమాన టికెట్లతో పాటు హోటల్‌లో ఏసీ వసతి సదుపాయం ఉంటుంది. బ్రేక్‌ఫాస్ట్‌, డిన్నర్‌ ఉంటుంది. మధ్యాహ్నం భోజనం మాత్రం యాత్రికులే చూసుకోవాల్సి ఉంటుంది. సైట్‌ సీయింగ్‌ కోసం వాహన సదుపాయం ఉంటుంది.

ఐఆర్‌సీటీసీ టూర్ ఎస్కార్ట్ సర్వీసెస్ అందుబాటులో ఉంటుంది. ఆలయాలో దర్శన టికెట్లు, విమానంలో ఆహార తదితర వాటికి ఖర్చులు ప్రయాణికులే భరించాల్సి ఉంటుంది. ప్యాకేజీని బుక్‌ చేసుకునేందుకు, పూర్తి వివరాల కోసం ఐఆర్‌సీటీసీ టూర్‌ వెబ్‌సైట్‌ టెంపుల్‌ రన్‌ ప్యాకేజీపై క్లిక్‌ చేయాలి. లేదంటే ఈ లింక్‌పై క్లిక్‌ చేసినా (irctctourism.com) వివరాలు.. కనిపిస్తాయి.

Updated On 5 Sep 2023 3:39 AM GMT
cm

cm

Next Story