HomelatestIRCTC Tourism | షిర్డీ సాయిబాబా భక్తులకు గుడ్‌న్యూస్‌..! హైదరాబాద్‌ నుంచి రూ.3370 ప్యాకేజీని ప్రకటించిన...

IRCTC Tourism | షిర్డీ సాయిబాబా భక్తులకు గుడ్‌న్యూస్‌..! హైదరాబాద్‌ నుంచి రూ.3370 ప్యాకేజీని ప్రకటించిన ఐఆర్‌సీటీసీ..!

IRCTC Tourism | షిర్డీ సాయిబాబా భక్తులకు ఐఆర్‌సీటీసీ శుభవార్త చెప్పింది. సమ్మర్‌లో షిర్డీకి వెళ్లాలనుకునే భక్తుల కోసం ఐఆర్‌సీటీసీ టూరిజం ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. సాయి సన్నిధి (Sai Sannidhi) పేరుతో హైదరాబాద్‌ నుంచి నుంచి ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఇది 2 రాత్రులు, 3 రోజుల టూర్ ప్యాకేజీ టూర్‌ కొనసాగుతుంది. ప్రతి బుధవారం టూర్‌ ప్రారంభంకానున్నది. ఈ టూర్‌ ప్యాకేజీ రూ.3370 మాత్రమే. సాయి సన్నిధి టూర్ ప్యాకేజీ కింద బూక్‌ చేసుకున్న పర్యాటకులు షిర్డీ సాయిబాబా ఆలయాన్ని దర్శించుకోవడంతో పాటు శని శింగణాపూర్ ఆలయాన్ని దర్శించుకోవచ్చు.

పర్యటన సాగేదిలా..?

Day 1 : ఐఆర్సీటీసీ టూరిజం షిరిడీ టూర్ ప్రతీ బుధవారం ప్రారంభమవుతుంది. మొదటి రోజు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి సాయంత్రం 06.50 గంటలకు అజంతా ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరాల్సి ఉంటుంది. ఆ రోజు రాతంత్రా ప్రయాణం కొనసాగుతుంది.

Day 2: రెండో రోజు ఉదయం 6.10 గంటలకు నగర్‌సోల్‌ రైల్వేస్టేషన్‌కు చేరుకుంటుంది. అక్కడి నుంచి షిర్డీకి బయలుదేరాల్సి ఉంటుంది. హోటల్‌లోకి చెకిన్‌ అయ్యాక షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించుకోవచ్చు. సాయంత్రం 4 గంటల వరకు హోటల్‌ నుంచి చెక్‌ అవుట్‌ అయి శని శింగణాపూర్‌కు బయలుదేరుతారు. అక్కడ శనేశ్వర ఆలయాన్ని దర్శించుకుంటారు. తర్వాత అక్కడి నుంచి బయలుదేరి నగర్‌సోల్‌ రైల్వేస్టేషన్‌కు చేరుకుంటారు. 9.30 గంటలకు రైలు ఉంటుంది. రాతంత్రా ప్రయాణం చేసి మరుసటి రోజు ఉదయం 8.50 గంటలకు రైల్వేస్టేషన్‌కు చేరుకోవడంతో పర్యటన ముగుస్తుంది.

ప్యాకేజీ వివరాలు..

ఐఆర్సీటీసీ షిరిడీ టూర్ ప్యాకేజీ ధర చూస్తే రెండు రకాల ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. గ్రూప్ బుకింగ్‌లో ఒకటి నుంచి ముగ్గురు, నలుగురు నుంచి ఆరుగురు ప్యాకేజీలో బుక్‌ చేసుకోవచ్చు. ఒకటి నుంచి ముగ్గురు బుక్‌ చేసుకుంటే కంఫర్ట్‌ కేటగరిలో సింగిల్‌ షేరింగ్‌కు రూ.12,100, ట్విన్‌ షేరింగ్‌లో రూ.6,530, ట్రిపుల్‌ షేరింగ్‌లో రూ.5,400, పిల్లలకు బెర్త్‌తో కలిపి రూ.4410 చెల్లించాల్సి ఉంటుంది. స్టాండర్డ్‌ కేటగిరిలో సింగిల్‌ షేరింగ్‌కు రూ.8510, ట్విన్‌ షేరింగ్‌కు రూ.4840, ట్రిపుల్‌ షేరింగ్‌కు రూ.3710, పిల్లలకు బెర్త్‌తో కలిపి రూ.2660 చెల్లించాల్సి ఉంటుంది.

నలుగురు నుంచి ఆరుగురు కలిసి బుక్‌ చేసుకుంటే.. కంఫర్ట్‌ కేటగిరిలో సింగిల్‌ షేరింగ్‌కు రూ.5390, ట్రిపుల్‌ షేరింగ్‌కు రూ.4860, పిల్లలకు బెడ్‌తో కలిపి రూ.4410 చెల్లించాల్సి ఉంటుంది. స్టాండర్డ్‌ కేటగిరిలో సింగిల్‌ షేరింగ్‌కు రూ.3700, ట్రిపుల్‌ షేరింగ్‌లో రూ.3170 చెల్లించాల్సి ఉంటుంది. పిల్లలకు రూ.2730 చెల్లించాల్సి ఉంటుంది. ప్యాకేజీలో స్టాండర్డ్ కేటగిరిలో స్లీపర్‌ క్లాస్‌ ప్రయాణం, కంఫర్ట్ కేటగిరిలో థర్డ్ ఏసీ ఉంటుంది. ఏసీ వాహనంలో ప్రయాణం, ఒక రోజు ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ ప్యాకేజీలో కవత్‌ అవుతాయి. వివరాలకు irctctourism.com/pacakage వెబ్‌సైట్‌లో సంప్రదించవచ్చు.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular