Allu Arjun, RRR, PUSHPA
విధాత: రాజమౌళి దర్శకత్వం వహించిన RRR సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించింది. అంతర్జాతీయ స్థాయి అవార్డులలో పోటీ పడుతుంది. ఏకంగా ఆస్కార్ (OSCAR) బరిలో నిలిచింది.
ఇదిలా ఉండగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా నటించిన పుష్ప (Pushpa) సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. సౌత్‌లోనే కాకుండా నార్త్‌లో కూడా ఈ సినిమా మంచి కలెక్షన్లు వసూలు చేసింది.
ఈ సినిమా మొత్తంగా 360 కోట్లు వసూలు చేయగా ఒక్క బాలీవుడ్‌లోనే 100 కోట్లకు పైగా వసూలు సాధించి ఆశ్చర్యానికి గురి చేసింది. పుష్ప సినిమా మంచి సక్సెస్ సాధించడంతో పుష్ప2 (Pushpa-2) సినిమా మీద మేకర్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.
కమల్ ఆర్ ఖాన్ ట్వీట్ వైరల్
పుష్ప 2 సినిమా అన్ని భాషల రైట్స్‌కి అల్లు అర్జున్ (ALLU ARJUN) 1050 కోట్లు డిమాండ్ చేస్తున్నారని బాలీవుడ్ వివాదాస్పద ఫిలిం క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ ట్విట్ చేశాడు. RRR రైట్స్ కేవలం రూ.750 కోట్లకు అమ్ముడయ్యాయి. ఈ నేపథ్యంలో పుష్ప 2 కోసం వెయ్యి కోట్లు డిమాండ్ చేస్తున్నారంటూ.. పుష్ప2 సినిమా ముందు RRR సినిమాని చులకన చేస్తూ RRR కంటే పుష్ప2 సినిమానే బెస్ట్ అనేది అల్లు అర్జున్ ఉద్దేశం అంటూ కమల్ ఆర్ ఖాన్ (Kamal R Khan) చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.
రైట్స్ కోసమే భారీ మొత్తంలో డిమాండ్
అయితే నిజంగా పుష్ప 2 మేకర్స్ ఈ స్థాయిలో డిమాండ్ చేస్తున్నారా? లేదా? అనే విషయం గురించి స్పష్టత లేదు. పుష్ప2 మేకర్స్ టార్గెట్ 1000 కోట్ల వసూలు అనే వార్త ప్రచారంలో ఉంది. కేవలం రైట్స్ కోసమే భారీ మొత్తంలో డిమాండ్ చేస్తున్నారన్న వార్తలు తెలియడంతో ఇక బిజినెస్ విషయంలో కూడా అంచనాలు భారీగా పెరిగిపోయాయి. పుష్ప సినిమా మంచి హిట్ కావడంతో పుష్ప 2 విషయంలో దర్శకుడు సుకుమార్ మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభమైంది.
Allu Arjun is asking ₹1050Cr for all the rights of #Pushpa2 ! #RRR rights were sold for ₹750Cr! Means @alluarjun believes that his film is bigger than #RRR. Fair enough.
— KRK (@kamaalrkhan) March 1, 2023