ఉన్నమాట: దేశంలో ప్రస్తుతం మరో జాతీయ పార్టీ ఏర్పాటు కంటే ప్రజలు ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్నారు. బీజేపీ వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఏకమౌతున్నాయి. ముఖ్యంగా ఎన్సీపీ, డీఎంకే, ఆర్జేడీ, ఎస్పీ, జేఎంఎం లాంటి పార్టీలు కాంగ్రెస్ పార్టీ లేకుండా జాతీయస్థాయిలో మరో కూటమి అసాధ్యమని కుండబద్దలు కొడుతున్నాయి. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, ఆప్ అధినేత కేజ్రీవాల్‌లు ఎవరికి వారు బీజేపీ, కాంగ్రెస్ యేతర ప్రత్యామ్నాయ ఫ్రంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నా మిగతా ప్రాంతీయపార్టీల […]

ఉన్నమాట: దేశంలో ప్రస్తుతం మరో జాతీయ పార్టీ ఏర్పాటు కంటే ప్రజలు ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్నారు. బీజేపీ వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఏకమౌతున్నాయి. ముఖ్యంగా ఎన్సీపీ, డీఎంకే, ఆర్జేడీ, ఎస్పీ, జేఎంఎం లాంటి పార్టీలు కాంగ్రెస్ పార్టీ లేకుండా జాతీయస్థాయిలో మరో కూటమి అసాధ్యమని కుండబద్దలు కొడుతున్నాయి. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, ఆప్ అధినేత కేజ్రీవాల్‌లు ఎవరికి వారు బీజేపీ, కాంగ్రెస్ యేతర ప్రత్యామ్నాయ ఫ్రంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నా మిగతా ప్రాంతీయపార్టీల నుంచి సరైన స్పందన లభించడం లేదు.
తాజాగా ఎన్సీపీ అధినేత చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. బీజేపీ వ్యతిరేకంగా కాంగ్రెస్ తో కలిసి పనిచేయడానికి బీహార్ సీఎం నితీశ్, జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా సానుకూలంగానే ఉన్నారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా కాంగ్రెస్‌తో కలిసి నడవడానికి సిద్దంగా ఉన్నారని తెలిపారు. బెంగాల్ ఎన్నికల్లో బీజేపీకి ఎక్కువ సీట్లు రావడానికి కాంగ్రెస్, వామపక్షాల కూటమే కారణమని మమత ఆరోపణ. అయితే ప్రస్తుతం నాటి విషయాలను విస్మరించి కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నట్టు పవార్ వెల్లడించారు.
అలాగే ఆప్ ఆధినేత తన పార్టీని విస్తరించే పనిలో ఉన్నారు. పంజాబ్ గెలుపు తర్వాత ఆయన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌పై దృష్టి సారించారు. ఆ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కేజ్రీవాల్ వైఖరిపై క్లారిటీ వస్తుంది. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు అన్నివర్గాల ప్రజల నుంచి అద్భుత ఆదరణ లభిస్తున్నది. కాంగ్రెస్ కార్యకర్తల్లో కూడా ఈ యాత్ర జోష్ నింపుతున్నది. కాంగ్రెస్ ఫార్టీ అధ్యక్ష బాధ్యతలు రాహులే చేపట్టాలనే డిమాండ్ వివిధ రాష్ట్రాల పీసీపీల నుంచి వస్తున్నది.
దీంతో ప్రాంతీయ పార్టీల్లోని ముఖ్యమైన పార్టీలు, సంఖ్యాపరంగా చూసినా తెలంగాణ లో కంటే ఎక్కువ స్థానాలు ఉన్న రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాధినేతలు కాంగ్రెస్ తో కలిపి ఏర్పడబోయే కూటమికే మొగ్గుచూపుతున్నట్టు ఇటీవల జరుగుతున్న పరిణామాల బట్టి స్పష్టమౌతుంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ అధినేత చెబుతున్నట్టు కాంగ్రెస్, బీజేపీ యేతర కూటమి కష్టమే.
అలాగే జాతీయ రాజకీయాలపై చర్చించడానికి కేసీఆర్ భేటీ అయిన, ఆయన తో భేటీ అవుతున్న నేతలు కూడా ఆయన జాతీయ రాజకీయాల్లోకి రావాలని మాత్రమే కోరుతున్నారు. జాతీయ పార్టీ పెట్టమని గాని, ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు చేయమని చెప్పిన దాఖలాలు లేవు. దీంతో కేసీఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిపి నడుస్తారా? లేక తటస్థంగా ఉంటారా? ఆయనతో కలిసి నడిచేది ఎవరు? అన్నది త్వరలో తేలుతుంది.
- ఆసరి రాజు
