Mega 157 విధాత: చాలాకాలంగా అభిమానులు ప్రేక్షకులు ఎదురు చూస్తున్న మెగా కాంబినేషన్ కుదిరినట్టే కనిపిస్తోంది. మెగాస్టార్ పక్కన జేజమ్మ అనుష్క కథానాయికగా నటించబోతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. మల్లిడి వశిష్ట దర్శకత్వం వహించబోతున్న చిరంజీవి #157 చిత్రంలో అనుష్కను హీరోయిన్‌గా తీసుకోవాలని చిత్ర బృందం భావిస్తోంది. కథాపరంగా కూడా నాయికకు చాలా ప్రాధాన్యం ఉండటంతో అద్భుత నటనాప్రావీణ్యం ఉన్న హీరోయిన్ అయితే బాగుంటుదనుకుంటున్న దర్శకనిర్మాతలు, మూడు ఆప్షన్లను హీరో చిరంజీవి ముందు ఉంచారట. అందులో, అనుష్క, నయనతార, […]

Mega 157
విధాత: చాలాకాలంగా అభిమానులు ప్రేక్షకులు ఎదురు చూస్తున్న మెగా కాంబినేషన్ కుదిరినట్టే కనిపిస్తోంది. మెగాస్టార్ పక్కన జేజమ్మ అనుష్క కథానాయికగా నటించబోతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. మల్లిడి వశిష్ట దర్శకత్వం వహించబోతున్న చిరంజీవి #157 చిత్రంలో అనుష్కను హీరోయిన్‌గా తీసుకోవాలని చిత్ర బృందం భావిస్తోంది.
కథాపరంగా కూడా నాయికకు చాలా ప్రాధాన్యం ఉండటంతో అద్భుత నటనాప్రావీణ్యం ఉన్న హీరోయిన్ అయితే బాగుంటుదనుకుంటున్న దర్శకనిర్మాతలు, మూడు ఆప్షన్లను హీరో చిరంజీవి ముందు ఉంచారట. అందులో, అనుష్క, నయనతార, మృణాల్‌ఠాకూర్ ఉన్నారు. ఈ ముగ్గురూ మంచి నటీమణులయినప్పటికీ, నయనతార ఈమధ్యే చిరంజీవితో గాడ్‌ఫాదర్‌లో నటించడం, మృణాల్ వయసులో చిన్నది కావడం వారికి మైనస్ పాయింట్లుగా మారాయి.
అనుష్క.. అరుంధతి, బాహుబలి లాంటి చిత్రాలతో తెలుగు చిత్రసీమలో లేడీ మెగాస్టార్‌గా అవతరించింది. చిత్రరంగ ప్రవేశం ఆలస్యమయినప్పటికీ, మంచి మంచి చిత్రాలలో నటించి తనదైన ముద్ర వేసుకుంది. ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది.
అనుష్క-చిరంజీవి కాంబినేషన్ ఎన్నోసార్లు ప్రయత్నించినప్పటికీ వివిధ కారణాల వల్ల సాధ్యపడలేదు. సరిగ్గా 17 ఏళ్ల క్రితం విడుదలైన చిరంజీవి స్టాలిన్ చిత్రంలో అనుష్క ఒక పాటకు చిరుతో కాలు కదిపింది. ఆ దరిమిలా ఈ జంట ఏ సినిమాలోనూ కనిపించలేదు. వశిష్ట రూపొందించబోతున్న ఈ సోషియోఫాంటసీ కథకు అనుష్క పర్‌ఫెక్ట్‌గా సూటవుతుండటంతో ఆమెనే ఖరారు చేయాలని భావిస్తున్నారు.
అదీకాక, నిర్మాతలు మరెవరో కాదు, అనుష్కకు అత్యంత ఆప్తులయిన యువీ క్రియేషన్స్. మొన్నే వారి కాంబినేషన్లో విడుదలైన మిస్ శెట్టి-మిష్టర్ పొలిశెట్టి చిత్రం మంచి పేరు తెచ్చుకుని, కలెక్షన్లను రాబడుతోంది. కాబట్టి అనుష్కను ఒప్పించడం పెద్ద పనేం కాదు. పైగా హీరో మెగాస్టార్. ఇంత గొప్ప అవకాశం ఎవరు మాత్రం వదులుకుంటారు చెప్పండి. నయనతార, మృణాల్ అయినా సరే.. ఈ మూడు ముక్కల్లో రాణి ఎవరో మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది
