Lion | nilgai
విధాత: అడవిలో ఆపదలు ఎదురవుతూ ఉంటాయి. ఒక జీవికి ఆకలేస్తే.. ఇంకో జీవి ఆయువు మూడినట్టే అన్నట్టు.. క్రూర మృగాల వేట కొనసాగుతుంది. వాటి దాడి నుంచి తప్పించుకునేందుకు సాధుజీవులు ప్రయత్నిస్తాయి. విఫలమైతే.. ప్రాణాలు కోల్పోయి.. వాటికి ఆహారంగా మారుతాయి. ఇది ఆటవిక ధర్మం.
అయితే.. క్రూరమృగాల దాడి నుంచి తప్పించుకునేందుకు చేసే ప్రయత్నాలు కొన్ని అబ్బుర పరుస్తాయి. మనుషులకు కూడా కష్టాలను ఎలా ఎదిరించాలో పాఠాలు చెబుతాయి. అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతున్నది. దీనిలో ఒక సింహం నీల్గాయిపై దూరం నుంచి పరుగెత్తి వచ్చి దాడి చేయగా దాని తప్పించుకునేందుకు ఆ నీల్గాయి చేసిన ప్రయత్నాలు చూపిన తెగువ మనల్ని అబ్బుర పరుస్తుంది. మీరు ఓ లుక్కేయండి.
చివరకు ఏమైంది? ఆ సింహం బారి నుంచి నీల్గాయి బయటపడిందా? లేక ఆహారమై పోయిందా తెలియదు కానీ.. ప్రమాదం ఎదురైనప్పుడు ఉపాయాలతో వాటిని తప్పించుకోవచ్చన్న సందేశం మాత్రం ఆ వీడియో ఇస్తున్నది.