గత చరిత్రకు వర్తమానంలో సమాధానం వెతకటం చారిత్రకమేనా.. విధాత: ఆధునిక భారత చరిత్రలో డిసెంబర్ 6 ప్రత్యేకమైనది. కొందరు దీన్ని విజయోత్సవ దినంగా ప్రకటించుకుంటుంటే, మరో వర్గం తమ ఆత్మగౌరవంపై జరిగిన దాడిగా, చీకటి దినంగా భావిస్తున్న స్థితి. ఇంతటి వైరుధ్య పూరిత ఘటన స్వాతంత్య్రానంతర భారత దేశంలో మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. 1992 డిసెంబర్ 6న‌ బాబ్రీ మసీదు కూల్చివేత, ఆ త‌ర్వాత దాని పునాదులపైనే రామాలయ నిర్మాణం తమ చారిత్రక విజయమని హిందూత్వ […]

  • గత చరిత్రకు వర్తమానంలో సమాధానం వెతకటం చారిత్రకమేనా..

విధాత: ఆధునిక భారత చరిత్రలో డిసెంబర్ 6 ప్రత్యేకమైనది. కొందరు దీన్ని విజయోత్సవ దినంగా ప్రకటించుకుంటుంటే, మరో వర్గం తమ ఆత్మగౌరవంపై జరిగిన దాడిగా, చీకటి దినంగా భావిస్తున్న స్థితి. ఇంతటి వైరుధ్య పూరిత ఘటన స్వాతంత్య్రానంతర భారత దేశంలో మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు.

1992 డిసెంబర్ 6న‌ బాబ్రీ మసీదు కూల్చివేత, ఆ త‌ర్వాత దాని పునాదులపైనే రామాలయ నిర్మాణం తమ చారిత్రక విజయమని హిందూత్వ శక్తులు చెప్పుకొంటున్నాయి. మధ్య యుగాల చరిత్రలో తమ సంస్కృతి, సాంప్రదాయాలపై తీవ్ర మైన అణిచివేత, విధ్వంసం జరిగిందని హిందుత్వ శక్తులు ప్రచారం చేస్తూ.., దానికిప్పుడు సమాధానం చెప్పే సమయం వచ్చిందని అంటున్నారు.

ఇదిలా ఉంటే.. ఎప్పుడో మధ్య యుగాలనాటి ఘటనలకు నేడు సమాధానాన్ని, పరిష్కారాన్ని వెతకటం అసంగతమని మైనారిటీలు అంటున్నారు. రాజుల కాలం నాటి ఘటనలకు నేడున్న సమాజాన్ని బాధ్యులుగా చేయటం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా ఒక జాతి సమూహాన్నే విదేశీయులుగా పరిగణించటం లౌకిక ప్రజాస్వామిక రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమని అంటున్నారు.

ఏదేమైనా.. చరిత్రలో జరిగిన కొన్ని ఘటనలకు వర్తమానంలో పరిష్కారాలు వెతకటం అశాస్త్రీయమే కాదు, అమానవీయం. భిన్నత్వంలో ఏకత్వం మన రాజ్యాంగ స్ఫూర్తి. దానికి విరుద్ధంగా ఎవరు ఏం చేసినా రాజ్యాంగ ఉల్లంఘనే. డిసెంబర్ 6 ఘటన గెలుపు ఓటముల సమస్యగా కాకుండా.., ఆధునిక నాగరిక ప్రపంచంలో జరుగకూడని ఘటనగా భావించాలి. ఆ క్రమంలోనే మైనారిటీ మతస్తులను గతానికి బాధ్యులను చేసి విదేశీయులుగా ముద్రవేయటం గర్హనీయం.

Updated On 6 Dec 2022 1:25 PM GMT
krs

krs

Next Story