నమ్మకం నిలబెట్టుకున్న ఇస్రో విజయాశ్వం పీఎస్ఎల్వీ గంటన్నర తర్వాత అత్యున్నత కక్ష్యలోకి ఉపగ్రహం Aditya L1 | విధాత: భారత తొలి సౌర ఉపగ్రహం ఆదిత్య ఎల్ 1 (Aditya L1) ను ఇస్రో (ISRO) విజయవంతంగా ప్రయోగించింది. శనివారం ఉదయం 11:50 గంటలకు ఇస్రో విజయాశ్వం పీఎస్ఎల్వీ.. ఆదిత్య ఎల్ 1 ఉపగ్రహంతో నింగిలోకి దూసుకెళ్లింది. అనంతరం 63 నిమిషాల తర్వాత ఉపగ్రహం రాకెట్ నుంచి విడిపోయే ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆ సమయానికి భూమికి […]

- నమ్మకం నిలబెట్టుకున్న ఇస్రో విజయాశ్వం పీఎస్ఎల్వీ
- గంటన్నర తర్వాత అత్యున్నత కక్ష్యలోకి ఉపగ్రహం
Aditya L1 | విధాత: భారత తొలి సౌర ఉపగ్రహం ఆదిత్య ఎల్ 1 (Aditya L1) ను ఇస్రో (ISRO) విజయవంతంగా ప్రయోగించింది. శనివారం ఉదయం 11:50 గంటలకు ఇస్రో విజయాశ్వం పీఎస్ఎల్వీ.. ఆదిత్య ఎల్ 1 ఉపగ్రహంతో నింగిలోకి దూసుకెళ్లింది. అనంతరం 63 నిమిషాల తర్వాత ఉపగ్రహం రాకెట్ నుంచి విడిపోయే ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆ సమయానికి భూమికి అత్యంత ఎత్తైన కక్ష్యలోకి ఉపగ్రహం చేరుకుంటుంది.
అనంతరం అదే కక్ష్యలో ఆదిత్య ఎల్ 1.. 16 రోజుల పాటు పరిభ్రమిస్తుంది. కావాల్సిన గతి వేగాన్ని పుణికి పుచ్చుకున్న అనంతరం..సూర్యుని వైపు తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. అలా ఇది 110 రోజుల పాటు విశ్వంలో ప్రయాణించి.. భూమికి 15 లక్షల కి.మీ. దూరంలో ఉన్న ఎల్ 1 పాయింట్ వద్ద స్థిరంగా కొనసాగుతుంది. అయితే ఈ దూరం.. భూమికి సూర్యునికి మధ్య దూరంతో పోల్చితే ఒక శాతం మాత్రమే.
#WATCH LIVE via ANI Multimedia | LIFTOFF! Aditya L1 mission heads to the Sun from Satish Dhawan Space Centre, Sriharikota#ISRO #adityal1https://t.co/CE2Xk9fkzw
— ANI (@ANI) September 2, 2023
సూర్యుని చుట్టూ ఉండే కరోనా, సూర్యుని ఉపరితల ఉష్ణోగ్రత, సౌర తుపానుల రాక, అంతరిక్ష వాతావరణం మొదలైన అంశాలపై ఆదిత్య ఎల్1 లో ఉండే పే లోడ్‌లు పరిశోధన సాగిస్తాయి. గ్రహణాలు వచ్చినా పరిశోధనలకు అంతరాయం కలగకుండా ఉండేందుకే ఎల్ 1 పాయింట్ దగ్గర ఆదిత్య ఎల్1ను ఉంచడానికి నిర్ణయించామని ఇస్రో పేర్కొంది.
INDIA to the #Sun🚀🌞🛰: @isro PSLV-C57/Aditya-L1 launched successfully to study the #Sun. #IADN pic.twitter.com/zIwMlEPt5P
— Indian Aerospace Defence News - IADN (@NewsIADN) September 2, 2023
ఆదిత్య ఎల్1 తో సమాచార సేకరణకు తమ డీప్ స్పేస్ నెట్వర్క్ ద్వారా సహకరించనున్నామని యురోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ) వెల్లడించింది. ఆస్ట్రేలియా, స్పెయిన్, అర్జెంటీలాలో ఉన్న 35 మీటర్ల డీప్ స్పేస్ యాంటెన్నాల ద్వారా సేకరించే సమాచాన్ని ఇస్రోకు ఇస్తామని పేర్కొంది. కౌరౌలో ఉన్న ఫ్రెంచ్ గయానా స్టేషన్, గూన్ హిల్లీ ఎర్త్ స్టేషన్‌లు ఆదిత్య ఎల్1 సమాచారాన్ని క్రోడీకరించడంలో
తోడ్పడతాయని ఈఎస్ఏ ఒక ప్రకటనలో పేర్కొంది. రానున్న రెండేళ్ల పాటు ప్రతి కొన్ని గంటలు.. ఆదిత్య ఎల్1 నుంచి సమాచారాన్ని సేకరిస్తామని.. ఈ మేరకు ఇస్రోతో ఒప్పందం ఉందని ఈఎస్ఏ స్పష్టం చేసింది.
