ISS |
విధాత: ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో అడుగుపెట్టనున్న తొలి సౌదీ మహిళగా రయ్యానా బర్నావీ రికార్డు సృష్టించనున్నారు. ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ ఆమెతో సహా నలుగురు వ్యోమగాములును (ఐఎస్ ఎస్) చేర్చడానికి ప్రయోగం చేపట్టింది.
ఆ సంస్థకు చెందిన ఫాల్కన్ రాకెట్.. వ్యోమగాములు ఉన్న డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌తో నింగిలోకి దూసుకెళ్లింది. సోమవారం అమెరికాలోని కేప్‌కార్నివాల్ నుంచి ఈ ప్రయోగం జరిగింది. ఈ ప్రయోగం ద్వారా ఐఎస్ఎస్‌లోకి అడుగుపెడుతున్న తొలి సౌదీ మహిళగా రయ్యానా బర్నావీ నిలవనున్నారు.
సౌదీకే చెందిన అలీ అల్కార్నీ, అమెరికన్ కమాండర్ పెగ్గీ విట్సన్, పైలట్ జాన్ షాఫ్నర్ ఆమెతో పాటు ఉన్నారు. వీరు సోమవారం సాయంత్రానికి అక్కడికి చేరుకోనుండగా.. వారం రోజుల తర్వాత భూమి పైకి తిరుగు పయనమవుతారు.
Saudi astronauts Ali Al-Karni and Rayana Barnawi set off into space, becoming the first woman from an Arab country to ever fly into space. pic.twitter.com/1UPuVtvI7Y
— Malinda 🇺🇸🇺🇦🇵🇱🇨🇦🇮🇹🇦🇺🇬🇧🇬🇪🇩🇪🇸🇪 (@TreasChest) May 22, 2023