Chandrababu | ఇప్పటికే గుర్తించిన ఐటి విభాగం.. నోటీసులు జారీ విధాత: చంద్రబాబు పోలవరాన్ని ఏటీఎం మాదిరి వాడుకుంటూ కమిషన్లు మింగుతున్నారు అని మోడీ ఆంధ్రప్రదేశ్‌లో మీటింగ్ పెట్టి మరీ చెప్పినమాట మరోమారు రుజువైంది. చంద్రబాబు రాత్రిపూట టార్చ్ లైటు పట్టుకుని ప్రాజెక్టు వద్దకు వెళ్లి కాంట్రాక్టర్లను కమిషన్ల కోసం వేధించే వాడు అంటూ దగ్గుబాటి వెంకటేశ్వర రావు చెప్పినమాట మరోమారు రుజువైంది. ఏయ్.. నేను నిప్పును.. ఇప్పటికి నా మీద ఒక్క ఆరోపణ లేదు.. ఎక్కడా […]

Chandrababu |
- ఇప్పటికే గుర్తించిన ఐటి విభాగం.. నోటీసులు జారీ
విధాత: చంద్రబాబు పోలవరాన్ని ఏటీఎం మాదిరి వాడుకుంటూ కమిషన్లు మింగుతున్నారు అని మోడీ ఆంధ్రప్రదేశ్‌లో మీటింగ్ పెట్టి మరీ చెప్పినమాట మరోమారు రుజువైంది. చంద్రబాబు రాత్రిపూట టార్చ్ లైటు పట్టుకుని ప్రాజెక్టు వద్దకు వెళ్లి కాంట్రాక్టర్లను కమిషన్ల కోసం వేధించే వాడు అంటూ దగ్గుబాటి వెంకటేశ్వర రావు చెప్పినమాట మరోమారు రుజువైంది. ఏయ్.. నేను నిప్పును.. ఇప్పటికి నా మీద ఒక్క ఆరోపణ లేదు.. ఎక్కడా రూపాయి అవినీతి లేదు.. నన్ను ప్రశ్నించే చట్టాలే పుట్టలేదు.. నన్ను ఎక్కడ ఎవరూ పట్టుకోలేరు అని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు అడ్డంగా దొరికారు.
ప్రాజెక్టులు ఇవ్వడం.. కమిషన్లు మింగడం
చంద్రబాబు ఇన్నేళ్ల రాజకీయంలో చేసింది ఒక్కటే. తనకు నచ్చినవాళ్లకు… అనుయాయులకు భారీగా రేట్లు పెంచి కాంట్రాక్టులు, పనులు ఇవ్వడం.. దానికి ప్రతిఫలంగా వారినుంచి వందలు.. వేలకోట్లలో కమిషన్లు నొక్కడం… ఇదే అయన టెక్నీక్.. గతంలో అధికారంలో ఉండగా కూడా ఇలాగే జరిగింది.
అమరావతి కాంట్రాక్టర్‌లు అయిన షాపూర్జి పల్లోంజి (ఎస్పిసిఎల్), ఎల్ అండ్ టి సంస్థల నుంచి సబ్ కాంట్రాక్టుల ద్వారా చంద్రబాబుకు రూ.118 కోట్ల ముడుపులు ముట్టాయి. ఈ విషయాలు ఐటి సంస్థల సోదాల్లో గుర్తించినట్లు తెలిసింది. ఈ క్రమంలో సదరు కాంట్రాక్టర్ చంద్రబాబుకు డబ్బు ముట్టజెప్పినట్లు షాపూర్ జి సంస్థ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్థసాని నివాసాల్లో తనిఖీల సమయంలో ఐటి శాఖ గుర్తించింది.
ఏమి జరిగింది? ఎలా జరిగింది?
అమరావతిలో నిర్మాణాల కాంట్రాక్టుల్లో చంద్రబాబు భారీగా అవినీతికి పాల్పడ్డారు. 2019 జనవరి, ఫిబ్రవరిలో చంద్రబాబు షాపూర్జీ పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ను పిలిపించుకుని తన పీఏ శ్రీనివాస్‌ను కలవమని చెప్పారు. దాంతో మనోజ్.. చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌ను కలిశారు.
షాపూర్జీ పల్లోంజీ కంపెనీ కర్నూలు, గుంటూరు, అనంతపురం, పశ్చిమగోదావరిలో టిడ్కో ఇళ్లు, అమరావతిలో హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం తాత్కాలిక భవనాల నిర్మాణంతో పాటు రాజధానిలో ఇతర నిర్మాణ పనులను కలిపి 2018 నాటికి రూ.8 వేల కోట్ల విలువ చేసే కాంట్రాక్ట్ పనులు చేసింది. అందులో తన కమీషన్లు వసూలు చేసేందుకు బాబు.. శ్రీనివాస్‌ను రంగంలోకి దింపారు.
వినయ్ నంగల్లా, విక్కీ జైన్ అనే ఇద్దరిని మనోజ్‌కు శ్రీనివాస్ అటాచ్ చేశారు. వీరిలో వినయ్ నంగల్లా మూడు కంపెనీలు, విక్కీ జైన్ రెండు కంపెనీలు సృష్టించారు. ఆ కంపెనీలకు బోగస్ సబ్ కాంట్రాక్టుల కింద డబ్బులు ఇవ్వమన్నారు. వాళ్ల నుంచి తాము డబ్బులు తీసుకుంటామని చంద్రబాబు పీఏ శ్రీనివాస్ మనోజ్‌తో చెప్పారు.
బోగస్ సబ్ కాంట్రాక్టు సంస్థల ద్వారా చంద్రబాబు ముడుపులు పొందినట్లు ఐటి అధికారులు ఆధారాలు సేకరించారు. ఇదంతా మనోజ్ వాసుదేవ్ పార్థసాని నివాసాల్లో తనిఖీల సమయంలో అసలు విషయం బయటపడింది. ఈ విషయాన్ని మనోజ్ వాసుదేవ్ (ఎంవిపి) ఐటి అధికారుల ముందు కూడా అంగీకరించారు.
దీంతో ఈ విషయంలో చంద్రబాబుకు సైతం ఆగష్టు 4వ తేదీనే హైదరాబాద్ ఐటీ సెంట్రల్ సర్కిల్ కార్యాలయం సెక్షన్ 153C కింద ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. సంస్థల నుంచి వచ్చిన ₹118 కోట్ల మొత్తాన్ని బహిర్గతం కాని ఆదాయంగా పరిగణించడం, చట్టం ప్రకారం ప్రాసెస్ చేయబడుతుందనే అంశాలను ఐటి శాఖ నోటీసుల్లో ప్రస్తావించింది.
