విధాత: సీఎం కేసీఆర్‌ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. చీకటి ఒప్పందంలో భాగంగానే టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు పీకే వ్యూహరచనలో పని చేస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పోటీలో లేదని చూపేందుకు టీఆరెస్, బీజేపీ కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. కొంపల్లిలో మీడియాతో రేవంత్‌ మాట్లాడుతూ.. బ్యాలెట్ పేపర్ లిస్టులో టీఆర్‌ఎస్ పార్టీ రెండో స్థానంలో ఉండడం నిబంధనలకు విరుద్ధమన్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడంపై ఫిర్యాదు చేసినా ఎన్నికల కమిషన్ […]

విధాత: సీఎం కేసీఆర్‌ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. చీకటి ఒప్పందంలో భాగంగానే టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు పీకే వ్యూహరచనలో పని చేస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పోటీలో లేదని చూపేందుకు టీఆరెస్, బీజేపీ కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు.

కొంపల్లిలో మీడియాతో రేవంత్‌ మాట్లాడుతూ.. బ్యాలెట్ పేపర్ లిస్టులో టీఆర్‌ఎస్ పార్టీ రెండో స్థానంలో ఉండడం నిబంధనలకు విరుద్ధమన్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడంపై ఫిర్యాదు చేసినా ఎన్నికల కమిషన్ పట్టించుకోవడం లేదని తెలిపారు.

బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను బహిరంగంగా దూషించడం‌పై కూడా ఫిర్యాదు చేశామన్నారు. సీఎం కేసీఆర్ పోలీసులందరినీ మునుగోడు నియోజకవర్గంలో మోహరించి కేసీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు.

నియోజకవర్గంలో ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసుల వివరాలు డీజీపీ ప్రకటించాలన్నారు. మునుగోడు ఎన్నికల్లో డబ్బు, మద్యంతో ఓట్లు సంపాదించాలనుకునే వారికి చెప్పుతో కొట్టినట్లు సమాధానం చెప్పాలి. నియోజకవర్గ సమస్యలపై ఈ నెల 26, 27న దీక్ష చేపడుతాం. అని తెలిపారు.

Updated On 20 Oct 2022 4:19 PM GMT
krs

krs

Next Story