Environment | రోజురోజుకు పెరుగుతున్న పర్యావరణ కాలుష్యం నేపథ్యంలో భూతాపం 1.5 డిగ్రీ సెల్సియస్ మించితే ప్రళయాలు, వేడిగాలులు, కరువులు, క్షామం ఏర్పడతాయని, వాటిని అధిగమించే ఏకైక ఉపాయం పర్యావరణాన్ని కాపాడుకోవడమేమని మోజర్లలోని ఉద్యాన కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ పిడిగం సైదయ్య అన్నారు. జూన్ 5 ను పునస్కరించుకొని వనపర్తి జిల్లాలో ఉద్యాన కళాశాల ఏర్పాటు చేసిన ప్రపంచ పర్యావరణ దినోత్సవం కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఒక మొక్క […]

Environment |

రోజురోజుకు పెరుగుతున్న పర్యావరణ కాలుష్యం నేపథ్యంలో భూతాపం 1.5 డిగ్రీ సెల్సియస్ మించితే ప్రళయాలు, వేడిగాలులు, కరువులు, క్షామం ఏర్పడతాయని, వాటిని అధిగమించే ఏకైక ఉపాయం పర్యావరణాన్ని కాపాడుకోవడమేమని మోజర్లలోని ఉద్యాన కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ పిడిగం సైదయ్య అన్నారు. జూన్ 5 ను పునస్కరించుకొని వనపర్తి జిల్లాలో ఉద్యాన కళాశాల ఏర్పాటు చేసిన ప్రపంచ పర్యావరణ దినోత్సవం కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఒక మొక్క సరాసరిన సంవత్సరానికి 100 కిలోలీటర్ల ఆక్సిజన్ అందిస్తుందని ఒక వ్యక్తికి సరాసరిన సాలీన 770 కిలోల ఆక్సిజన్ అవసరమని అంటే కనీసం ఏడు నుంచి ఎనిమిది చెట్లను ప్రతి వ్యక్తి సరసన నాటుకుంటేనే భవిష్యత్తులో ఆక్సిజన్ కొనే పరిస్థితి ఉండదని ఆయన చెప్పారు. లేదంటే ప్రతిరోజు హాస్పిటల్ లో కొనేటట్టే ఆక్సిజన్ సిలిండర్ను సైతం కొనుక్కొని వెంట తిరగాల్సిన అవసరం, గత్యంతరం ఏర్పడుతుందని ఆయన గుర్తు చేశారు.

ఉష్ణోగ్రతలు సరాసరిన ఒకటి పాయింట్ ఐదు డిగ్రీలు సెల్సియస్ మించితే ఇప్పుడున్న పంట రకాల్లో ఉత్పత్తి గనణనీయంగా తగ్గిపోతుందని తద్వారా ఆహార భద్రతకే పెను ప్రమాదం ఏర్పడుతుందని గుర్తు చేశారు. అయితే ప్రధాన పంటలైన వరి, గోధుమ, సోయాబీన్ లు c3 పంటలని వాటిలో కూడా నాణ్యత ఉత్పత్తి దెబ్బతినే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో సి4 పంటలైన చిరుధాన్యాలు, సజ్జలు, జొన్నలు, మొక్కజొన్న వంటి పంటలకు మానవాళి మరలవలసి ఉంటుందని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో భారీ ఎత్తున మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పారు. సేంద్రియ పద్ధతిని అవలంబిస్తూనే, పర్యావరణ మార్పులు నేపథ్యంలో అధిక వేడిని, నీటి అద్దరిని తట్టుకునే పంట రకాలు సైతం రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రస్తుత పంటల స్థానంలో మరికొన్ని కొత్త పంటలను కూడా సాగు చేసేందుకు సిద్ధం కావాలని తెలిపారు. అయితే పశువులు, వరి వంటి ప్రధాన పంటల నుంచే గ్లోబల్ వార్మింగ్ కారణమైన రసాయనాలు నేపథ్యంలో వాటిని తగ్గించే ప్రయత్నాలు కూడా చేయాలని అన్నారు.

ప్లాస్టిక్ భూతం అన్నిచోట్లకు వ్యాపించిందని, తల్లిపాలను సైతం ప్లాస్టిక్ మింగేసిందని గుర్తు చేశారు. దేశంలో సింగిల్ యూస్ ప్లాస్టిక్ బ్యాన్ చేయడం చాలా సంతోషకరమైన విషయమని లేదంటే సింగిల్ యూస్ ప్లాస్టిక్ భూమిలో విచ్చినం కావడానికి కనీసం 1000 సంవత్సరాలు పడుతుందని చెప్పారు. ప్రపంచంలో అత్యంత ఎత్తైన ఎవరెస్టు శిఖరాల దగ్గర నుంచి అత్యంత లోతైన అంటే 11 మీటర్ల లోతున్న మెరీనం ట్రెంచ్ సైతం ఈ ప్లాస్టిక్ బారిన పడినవేని చెప్పారు. సాధ్యమైనంత వరకు పర్యావరణహిత పదార్థాలను వాడడం అలవాటు చేసుకోవాలని, మనం పర్యావరణంలో భాగంగానే జీవిస్తున్నాం అని గుర్తు చేసుకోవాలని, లేదంటే పర్యావరణం నాశనం అయితే మన నాశనం కూడా మొదలైనట్టే అని తెలిపారు.

ఈ సందర్భంలో ధర్మో రక్షతి రక్షితః , ఎంత గొప్పగా ఉంటుందో వృక్షో రక్షతి రక్షితః కూడా అంతే గొప్పగా ఉంటుందని ఆయన తెలియజేశారు. అనంతరం పర్యావరణ దినోత్సవ సందర్భంగా విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో OSA రాజశేఖర్, సీనియర్ అద్యాపకులు డాక్టర్ shahanaz, నాగరాజు చంద్రశేఖర్, గౌతమి, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated On 5 Jun 2023 3:08 PM GMT
krs

krs

Next Story