Wednesday, March 29, 2023
More
    HomelatestGovernor.. Sathyavathi l గ‌వ‌ర్న‌ర్.. బిల్లులు పెండింగ్ పెట్టడం దురదృష్టకరం: మంత్రి స‌త్య‌వ‌తి

    Governor.. Sathyavathi l గ‌వ‌ర్న‌ర్.. బిల్లులు పెండింగ్ పెట్టడం దురదృష్టకరం: మంత్రి స‌త్య‌వ‌తి

    Governor.. Sathyavathi.. pending bills

    • చట్టసభల నిర్ణయాలపై గౌరవం ఉండాలి
    • ప్రీతి మృతి పై నిష్పక్షపాత విచారణ
    • రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్

    విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: చట్టసభలు ఆమోదించిన బిల్లులను గవర్నర్ (Governor) ఆమోదించకుండా పెండింగ్‌లో పెట్టడం దురదృష్టకరమని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ గిరిజన అభివృద్ధి శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ (Minister Satyavati Rathore) అన్నారు. రాష్ట్ర గవర్నర్ తమిళసై (Governor Tamilsai) బిల్లులను ఆమోదించకుండా పెండింగ్ పెట్టిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై గవర్నర్ కూడా ట్విట్టర్ వేదికగా ప్రతిస్పందించారు. ఈ విషయాలపై మంత్రి సత్యవతి పై విధంగా స్పందించారు.

    హనుమకొండలో శనివారం ఆమె మీడియాతో చిట్ చాట్ చేశారు. గవర్నర్ వ్యవస్థను గౌరవిస్తాం గానీ ఇలా అయితే మిమ్మల్ని ఎందుకు గౌరవించాలంటూ ప్రశ్నించారు. చట్టసభల నిర్ణయాల పై గౌరవం ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు చేసిన బిల్లుల పట్ల చిన్నచూపు ఎంతవరకు న్యాయమైందన్నారు.

    ప్రీతి సంఘటనపై నిష్పక్షపాత విచారణ

    కేఎంసి మెడికో డాక్టర్ ప్రీతి మృతి సంఘటన బాధాకరమని అన్నారు. ఆమె మృతి పై విచారణ నిష్పక్షపాతంగా జరుగుతుందని స్పష్టం చేశారు. ప్రీతి కుటుంబానికి ప్రభుత్వం తగిన న్యాయం చేస్తుందని హామీ ఇచ్చారు. ప్రీతి తల్లిదండ్రులు ఎలాంటి ప్రలోభాలకు లొంగకూడదన్నారు. విచారణ పై నమ్మకం లేకుంటే వారు ఎవరితో విచారణ కోరుకుంటే వారితో జరిపిస్తామని చెప్పారు.

    spot_img
    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular