విధాత: RS బ్రదర్స్ సంస్థలపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో 25కు పైగా ఐటీ బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. ఉదయం 5 గంటలకే ఐటీ అధికారులు బృందాలు ఏర్పడి హైదరాబాద్‌లోని ఆర్ఎస్ బ్రదర్స్ బ్రాంచీలతో పాటు గోదాముల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. కంప్యూటర్‌లు, పత్రాలను పరిశీలిస్తున్నారు. ఆ సంస్థలు, యజమానుల ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నాయి. కూకట్‌పల్లిలోని సౌత్ ఇండియా షాపింగ్‌మాల్‌లోనూ, బిగ్ సీ షాప్‌లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. సిబ్బందితో పాటు కొనుగోలు దారులను కూడా ఐటీ అధికారులు లోపలికి […]

విధాత: RS బ్రదర్స్ సంస్థలపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో 25కు పైగా ఐటీ బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. ఉదయం 5 గంటలకే ఐటీ అధికారులు బృందాలు ఏర్పడి హైదరాబాద్‌లోని ఆర్ఎస్ బ్రదర్స్ బ్రాంచీలతో పాటు గోదాముల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు.
కంప్యూటర్‌లు, పత్రాలను పరిశీలిస్తున్నారు. ఆ సంస్థలు, యజమానుల ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నాయి. కూకట్‌పల్లిలోని సౌత్ ఇండియా షాపింగ్‌మాల్‌లోనూ, బిగ్ సీ షాప్‌లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. సిబ్బందితో పాటు కొనుగోలు దారులను కూడా ఐటీ అధికారులు లోపలికి అనుమతించడం లేదు.
RS బ్రదర్స్ యాజమాన్యం స్థిరాస్థి సంస్థల్లో పెట్టుబడులు పెట్టింది. హానర్స్ రియల్ ఇన్ఫ్రా పేరుతో వ్యాపారాలు నిర్వహిస్తూ వాసవితో పాటు పలు ప్రాజెక్టులు చేపట్టింది. అయితే వాటి లావాదేవీలకు, పన్నుల చెల్లింపులకు సరిపోవడం లేదనే అనుమానంతో ఐటీ అధికారులు సమాచారం సేకరించి సోదాలు చేస్తున్నారు.
వాసవీ స్థిరాస్థి కన్‌స్ట్రక్షన్‌లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ సోదాలకు సంబంధించి అధికారులు ఎలాంటి వివారాలు వెల్లడించడం లేదు. కూకట్ పల్లిలోని గల్ఫ్ ఆయిల్ ల్యాండ్ వివాదాల్లో హానర్స్. కూడా జోక్యం చేసుకుంది. హానర్స్, వాసవి సుమధురతో కలిసి RS బ్రదర్ వ్యాపారాలు చేస్తున్నారు.
