Cow Urine | గోవుకు హిందూ సంప్రదాయంలో ప్రత్యేక స్థానం ఉన్నది. దేశంలో గోవును దేవతా పూజిస్తారు. అయితే, గోమూత్రం సర్వరోగ నివారిణి అని ఆయుర్వేద నిపుణులు పేర్కొంటున్నారు. పలువురు నిత్యం గోమూత్రాన్ని తీసుకుంటూ వస్తుంటారు. గోమూత్రంలో హానికారకమైన బ్యాక్టీరియా ఉందని, ఇది మనుషులు తీసుకునేందుకు పనికిరాదని ఇండియన్‌ వెటర్నరీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (IVRI) ఇటీవల వెల్లడించింది. తాజాగా ఇండియన్‌ వెటరన్నరీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (IVRI)కి చెందిన సీనియర్‌ శాస్త్రవేత్తలు గోమూత్రం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. […]

Cow Urine |

గోవుకు హిందూ సంప్రదాయంలో ప్రత్యేక స్థానం ఉన్నది. దేశంలో గోవును దేవతా పూజిస్తారు. అయితే, గోమూత్రం సర్వరోగ నివారిణి అని ఆయుర్వేద నిపుణులు పేర్కొంటున్నారు. పలువురు నిత్యం గోమూత్రాన్ని తీసుకుంటూ వస్తుంటారు. గోమూత్రంలో హానికారకమైన బ్యాక్టీరియా ఉందని, ఇది మనుషులు తీసుకునేందుకు పనికిరాదని ఇండియన్‌ వెటర్నరీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (IVRI) ఇటీవల వెల్లడించింది. తాజాగా ఇండియన్‌ వెటరన్నరీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (IVRI)కి చెందిన సీనియర్‌ శాస్త్రవేత్తలు గోమూత్రం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

గత నాలుగేళ్లుగా గోమూత్రంపై తొమ్మిది మంది సభ్యుల శాస్త్రవేత్తల బృందం ఈ అధ్యయనం చేపట్టింది. ఈ అధ్యయనంలో మనుషులకు మేలు చేసే యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఫంగల్‌ గుణాలు ఉన్నాయని గుర్తించారు. ఈ అధ్యయనంలో సాహివాల్‌, తార్పార్కర్‌ పేరు గల రెండు దేశీయ ఆవుల నుంచి 14 మూత్రాల నమూనాలను సేకరించి, విశ్లేషించారు. అదే సమయంలో వాటిని సంకరజాతి ఆవుల నమూనాలతో పోల్చి చూశారు. మూత్రం బ్యాక్టీరియాతో కలుషితమయ్యే అవకాశం ఉన్నందున.. ప్రతి సంవత్సరం వివిధ సీజన్లలో గోమూత్రం శాంపిల్స్‌ను సేకరించారు. వీటి నుంచి ఎక్స్‌ట్రాక్ట్ చేసిన రూపంపై అధ్యయనం నిర్వహించారు.

ఇంతకుముందు గోమూత్రం మానవులకు ప్రమాదకరమని చేసిన వ్యాఖ్యలను అధ్యయన బృందం ఖండించింది. ఆవుమూత్రలో ఔషధ గుణాలున్నాయని స్పష్టం చేసింది. సంకరజాతి ఆవుల కంటే సాహివాల్, థార్పార్కర్ జాతి ఆవుల మూత్రం బ్యాక్టీరియాను నిర్మూలించడంలో ప్రభావంతంగా ఉంటుందని గుర్తించారు. ఆవు మూత్రంలో ఈ.కొలి (E.coli), సాల్మోనెల్లా జాతులు, సూడోమోనాస్ ఎరుగినోసా, లిస్టెరియా మోనోసైటోజెన్స్, బాసిల్లస్ సెరియస్, స్టెఫిలోకాకస్ ఆరియస్ వంటి వాటిని నిర్మూలిస్తుందని శాస్త్రవేత్తల బృందం వెల్లడించింది.

ఆవు మూత్ర సారం ఈస్ట్‌లకు వ్యతిరేకంగా యాంటీ ఫంగల్ ( Antifungal Properties ) ప్రభావాన్ని తగ్గిస్తుందని పేర్కొంది. 2018లో ఎనిమిది శాస్త్రవేత్తల బృందం ఈ అధ్యయనం నిర్వహించగా.. ఐవీఆర్‌ఐ శాస్త్రవేత్త రవికాంత్‌ అగర్వాల్‌ నాయకత్వం వహించారు. ఆవు మూత్రంలో ఔషధ, వైద్య గుణాలు పుష్కలంగా ఉన్నాయని బృందం గుర్తించింది. ఆవు మూత్రంలో కనిపించే యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు మానవులు, జంతువులలో ఇన్ఫెక్షన్లను నయం చేయడంలో దోహదపడుతుందని అధ్యయనం తేల్చింది.

Updated On 9 May 2023 3:43 AM GMT
Vineela

Vineela

Next Story