HomelatestMLA Rapaka Varaprasad | అతి..అంటే ఇదే! పెళ్లి పత్రికపై జగన్, భారతి ఫొటో

MLA Rapaka Varaprasad | అతి..అంటే ఇదే! పెళ్లి పత్రికపై జగన్, భారతి ఫొటో

  • ఎమ్మెల్య రాపాక అతి భక్తి

విధాత: వైఎస్‌ జగన్‌కు భక్తులలో పరమ భక్తుడిని తానే అని నిరూపించుకుంటున్నారు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ (MLA Rapaka Varaprasad). జనసేన తరఫున గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే.. ఆ తర్వాత వైసీపీలోకి ఫిరాయించారు. మళ్ళీ ఆయనకు జగన్ టికెట్ ఇస్తారని ఆశతో ఉన్నారు.

ఇదే క్రమంలో ముందునుంచి వైసీపీలో ఉన్న నాయకుల కన్నా ఎక్కువగా జగన్ మీద ప్రేమ, విధేయత వినయం కనబరుస్తుంటారు. రాపాక వరప్రసాదరావు, నాగరత్నం దంపతుల కొడుకు వివాహం జూన్ 7న జరగనుంది.

ఈ సందర్భంగా మరోసారి ఆయన జగన్‌పై తన అభిమానాన్ని కాస్త ఎక్కువగా చాటుకున్నారు. తన కుమారుడి పెళ్లి పత్రికపై ఏపీ సీఎం వైఎస్ జగన్‌, ఆయన భార్య భారతి ఫోటోను ముద్రించారు.

అక్కడితో ఆగకుండా.. ‘‘మాకు దైవ సమానులైన మా ప్రియతమ నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, భారతమ్మ గార్ల ఆశీస్సులతో..’’ అని దాని మీద రాయించారు.

ఈ పెళ్లి కార్డు ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌ కాగా.. వైసీపీ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే జనసేన కార్యకర్తలు మాత్రం రాపాక తీరును వెక్కిరిస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలను మించి భజన చేస్తున్నాడని అంటున్నారు.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular