విధాత: ఇటు ఆంధ్రాలో శాసనసభ బడ్జట్(Budget) సమావేశాలు జరుగుతున్నాయి. ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వం మీద విమర్శలు ఎక్కుపెడుతున్నాయి. ఇలాంటి తరుణంలో సభలో ఉంటూ వారి విమర్శలకు ఎదురు సమాధానం ఇవ్వాల్సిన సభానాయకుడు జగన్ మోహన్ రెడ్డి(YS Jaganmohan Reddi) ఢిల్లీ (Delhi)వెళ్తున్నారు. ఇలాంటప్పుడు కూడా సభను వదిలేసి హుటాహుటిన ఢిల్లీ ఎందుకు వెళ్తున్నట్లు. ఏం జరుగుతోంది.
ఈరోజు రాత్రి జగన్ ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయల్దేరి వెళ్తారు. ఆయన రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, (Narendra Modi) హోం మంత్రి అమిత్ షాలతో (Amit shaw)భేటీ అవుతారని చెబుతున్నారు. మోడీతో జగన్ అనేక లక విషయాలను చర్చిస్తారు అని అంటున్నారు.
ఈ శాసన సభ సమావేశాల్లోనే మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెడదామని అనుకున్నారు. కానీ సుప్రీం కోర్టులో కేసు విచారణ దశలో ఉండడం వల్ల వీలుపడలేదు. అందుకే గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంలోనూ ఆ అంశాన్ని చేర్చలేదు. ఇదిలా ఉండగా జగన్ ఉగాదికి రాజధానితో బాటు క్యాంప్ ఆఫీసును విశాఖ (Visakhapatnam)తరలించే ప్లాన్‌లో ఉన్నాఅదిప్పుడే సాధ్యం అయ్యేలా లేదు. దీంతో విశాఖ మారడం అనేది జూలైకి వాయిదా వేశారు.
ఇక ఈ మూడు రాజధానుల అంశం మీద కేంద్రం గతంలో హైకోర్టులో విచారణ జరిగినపుడు రాజధాని ఎక్కడ ఉండాలన్నది రాష్ట్రాల ఇష్టమని అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం అదే సుప్రీం కోర్టులో ఇదే కేసు విచారణ దశలో ఉండగా విభజన చట్టం ప్రకారం అమారవతినే రాజధానిగా గుర్తించినట్లుగా పేర్కొంటూ అఫిడవిట్ దాఖలు చేసింది. దీంతో జగన్‌కు తలనొప్పులు వచ్చిపడ్డాయి.
ఈ నేపధ్యంలో కేంద్రం మనసులో ఏముందో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగానే జగన్ అర్జంటుగా పయనమైనట్లు తెలుస్తోంది.. ఈ విషయంలో కనుక ఒక సానుకూల అభిప్రాయం వస్తే ఏపీ అసెంబ్లీలోనే విశాఖ రాజధానిగా తాము ప్రతిపాదిస్తున్నామని జగన్ ఈ బడ్జెట్ సెషన్ లోనే చెబుతారని అంటున్నారు.