Homeఆంధ్ర ప్రదేశ్Ys Jagan | మొక్కకు అంటు కట్టినట్లు.. చంద్రబాబు గుట్టు విప్పేసిన జగన్

Ys Jagan | మొక్కకు అంటు కట్టినట్లు.. చంద్రబాబు గుట్టు విప్పేసిన జగన్

Amaravathi | Ys Jagan

  • పిట్ట కథ చెప్పినట్లుగా.. పక్షికి గింజలు తినిపిస్తున్నట్లు
  • నరకాసురుడిని నమ్మండి… చంద్రబాబును నమ్మకండి
  • అమరావతి ఇళ్ల పట్టాల పంపిణీ సభలో జగన్ ఉద్వేగం

విధాత: శివమణి ఎడాపెడా డ్రమ్స్ వాయించినట్లు కాకుండా.. చెరువుగట్టున కూచుని హరిప్రసాద్ చౌరాసియా తనను తాను మైమరచి ప్రశాంతంగా వేణువు వాయించినట్లు.. ధోని బంతిని చాకిరేవు పెట్టినట్లు కాకుండా అడుగు కదలకుండా అజహరుద్దీన్ జస్ట్ మణికట్టు ఇలా కదపడం ద్వారా బాలును బౌండరీ దాటించినట్లు.. మసాలా వేసి గ్రైండర్లో రుబ్బినట్లు కాకుండా.. జస్ట్ నేతిలో జీడిపప్పు వేయించి నోటికి అందించినట్లు.. తాతమ్మ మానవరాళ్లను పొదుపుకుని పిట్ట కథలు చెప్పినట్లు .. చిన్న పిల్లాడి చేతిలో బెల్లం ముక్క పెట్టినట్లు.. అవును.. అమరావతిలో సీఎం వైయస్ జగన్ ప్రసంగం అచ్చం అలాగే సాగింది..

పేదల కోసం ఇల్లు ఇవ్వాలి అంటూ దేశవ్యాప్తంగా ఉద్యమాలు సాగాయి కానీ పేదలకు ఇల్లు ఇవ్వొద్దు అంటూ కోర్టుల్లో కేసులు వేసిన వైనం అమరావతి ఒక్క చోటనే జరిగింది అంటూ జగన్ ఆవేదనాపూరిత ప్రసంగం సభికులను ఆకట్టుకుంది. పేదల కోసం తాను ఎంత తాపత్రయ పడుతున్నదీ.. దాన్ని అడ్డుకునేందుకు చంద్రబాబు బృందం ఎంతలా ప్రయత్నిస్తున్నదీ లెక్కలతో సహా జగన్ వివరించారు.

చంద్రబాబు గత పాలనలో ఎక్కడా ఒక్క సెంట్ భూమి ఇవ్వని చంద్రబాబు తానూ చేస్తున్న ఇళ్ల యజ్ఞాన్ని సామజిక సమతుల్యత పేరుతొ అడ్డుకుంటున్న వైనాన్ని కళ్లకుకట్టినట్లు వివరించారు. లబ్ధిదారులకు ఇంతవరకూ తాను ఎన్ని విధాలా మేలు చేసిందీ.. ఇంకెంత చేస్తాను అన్నదీ చక్కగా అరటిపండు వలిచి పెట్టినట్లు చెప్పారు.

అంతలోనే నరకాసురుడిని అయినా నమ్మండి నారా చంద్రబాబును మాత్రం నమ్మకండి అంటూ ఆయన చేసిన ప్రసన్నం ప్రజల్లో ఆలోచనలకూ బీజం వేసింది.. మీరు (పేదలు) నేనూ ఒకవైపు ఉన్నాం.. అటువైపు చంద్రబాబు సారధ్యంలో పెత్తందారులు ఉన్నారు.. మనం వాళ్ళతో యుద్ధం చేస్తున్నాం.. అంటూ తానూ పేదల పక్షాన సేనానిని అని వారిని తన సొంతవారిగా అక్కున చేర్చుకున్నారు.

మనం.. పేదలం అమరావతిలో ఉంటే సామాజిక సమతుల్యం దెబ్బ తింటుందట…అంటే ఇది పెద్దల నగరం అట.. మనం ఉండకూడదట అని చెబుతూ పేదల్లో ఈ అంశం చర్చకు బీజం వేసారు. ఎక్కడా మాట తూలకుండా గొంతు పెంచకుండా .. చల్లగా వింజామరతో విసురుతున్నట్లుగా ప్రజల మెదళ్లలోకి తన వాయిస్ ఎక్కించేసారు.. ఫైనల్ గా తాను పేదల పక్షపాతిని అయితే తన సంక్షేమ యజ్ఞాన్ని చంద్రబాబు, అయన పక్షాన ఉండే రాక్షసులు భగ్నం చేస్తున్నారు అని చెబుతూ పేదల మనసులు దోచేశారు.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular