Thursday, March 23, 2023
More
  Homelatestజగన్ సడన్‌గా ఢిల్లీ టూర్.. అందుకేనా..?

  జగన్ సడన్‌గా ఢిల్లీ టూర్.. అందుకేనా..?

  విధాత‌: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హఠాత్తుగా ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు.. ఉన్నఫళంగా ఎందుకు వెళ్తున్నారో తెలియదు. రాష్ట్రానికి సంబంధించిన సమస్యల మీద చర్చించేందుకు వెళ్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నా వేరే ఎజెండా ఏదో ఉందని అంటున్నారు.

  ఈ నెల 31 ఢిల్లీలో గ్లోబల్ సమ్మిట్ కర్టెన్ రైజర్ ఈవెంట్ కి ఆయన హాజరవుతారని అంటున్నారు. అయితే ఇది చాలా రోజుల క్రితమే ఖరారు అయింది. అప్పటి సమాచారం మేరకు ఏపీ నుంచి అధికారులే హాజరవుతారని అనుకున్నారు. కానీ ఇప్పుడు డైరెక్ట్ గా జగన్ హాజరవుతుండడం పలు ప్రశ్నలకు కారణం అవుతోంది.

  జగన్ ఢిల్లీ టూర్‌లో ప్రధాని నరేంద్ర మోడీని, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతోనూ భేటీ అవుతారు . ఇక జగన్ ఈ నెల 27, 28 తేదేల నుంచి ఢిల్లీ వెళ్ళేందుకు అన్ని ఇతర ప్రోగ్రామ్స్ ని రద్దు చేసుకున్నారు అని అంటున్నారు. విశాఖలో శారదాపీఠంలో జరిగే రాజశ్యామల కార్యక్రమానికి ఆయన హాజరు కావాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో రద్దయింది.

  ఇక విశాఖలో మార్చి నెల 2, 3 తేదీలలో గ్లోబల్ సమ్మిట్ జరగనుంది. దానికి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడిదారులు ప్రముఖ పరిశ్రమల అధిపతులు హాజరవుతారని అంటున్నారు. ఈ సదస్సులో భారీగా పెట్టుబడులు సమీకరిస్తామని, మొత్తం రాష్ట్ర ముఖచిత్రాన్ని మారుస్తామని వైసిపి ఆశిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ మీటింగ్ కర్టెన్ రైజర్ ఈవెంట్ కి జగన్ వెళుతున్నారని అంటున్నారు.

  ఇక కేంద్ర బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న వేళ ప్రధానిని కలసి పోలవరం నిధులతో పాటు ఏపీకి ఆర్థికంగా భరోసా ఇచ్చే ప్రాజెక్టుల మీద కూడా చర్చిస్తారు అంటున్నారు. వీటితో పాటు ఏపీలో మారుతున్న రాజకీయం నేపథ్యంలో పొత్తులు ఎత్తుల గురించి చర్చ ఉండొచ్చని అంటున్నారు.

  అయితే టిడిపి మద్దతుదారులైన మీడియా మాత్రం వేరేగా రాస్తోంది. వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సిబిఐ విచారించిన నేపథ్యంలో జగన్ కలవరపాటుకు గురయ్యారని, అందుకే ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి జగన్ వెళ్తున్నారని రాస్తున్నారు.

  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular