Wednesday, December 7, 2022
More
  Homelatestక‌విత‌క్క‌కు జ‌గ‌న‌న్నసపోర్ట్..?

  క‌విత‌క్క‌కు జ‌గ‌న‌న్నసపోర్ట్..?

  నిరంజన్ రెడ్డి తోడుగా ఢిల్లీకి ప‌య‌నం..

  విధాత‌: న్యూఢిల్లీలోని లిక్కర్ స్కామ్ దేశ రాజకీయాల్లో పెను దుమారమే లేపుతోంది. దేశంలో ఏమూల భారీ స్థాయి అవినీతి, అక్రమం.. కుంభకోణం.. స్కామ్ జరిగినా దాని మూలాలు తెలుగు రాష్ట్రాల్లోనే ఉంటున్నాయన్నది ఈ లిక్కర్ స్కాముతో మరోమారు స్పష్టమయింది.

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి సన్నిహితుడైన ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు, ఆయన బంధువులు ఈ స్కాములో ఉన్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న తరుణంలోనే అటు తెలంగాణలో కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత, ఆమె పీఏలు, మేనేజర్లను సైతం ఈ కుంభకోణంలో భాగం చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ.

  అంతే కాకుండా టీడీపీ వాళ్లు ఒక అడుగు ముందుకు వేసి జగన్ సతీమణి భారతిరెడ్డి సైతం ఇందులో భాగమే అంటూ ఆరోపణలు గుప్పించారు. దాని సంగతి పక్కనబెడితే ఇప్పుడు దీనికి సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వంటివారు కవితను, ఆమెకు సంబంధించిన వ్యాపార భాగస్వాములను ఇరికించేందుకు సరిపడా సాక్ష్యాలు సేకరించే పనిలో పడ్డారు.

  బీజేపీ మీద కేసీఆర్ విరుచుకుపడుతున్నకొద్దీ కవిత మీద ఈడీ దాడులు పెరుగుతున్నాయన్న సంకేతాలు ప్రజల్లోకి వెళుతున్నాయి. ఏదీ ఏమైనా ఇప్పుడు కవితను ఈ ఉచ్చులోనుంచి బయటకు లాగి ఆమెను నిష్కళంక ప్రజాసేవకురాలిగా, నాయకురాలిగా ప్రజల ముందు నిలబెట్టడం కేసీఆర్ తక్షణ కర్తవ్యం అయింది. అయితే ఇప్పుడు ఉన్నఫళంగా ఆమెను కేసుల్లోంచి బయటకు తెచ్చేది ఎవరు.. ఎవరు.. ఎవరు..అని ఆలోచిస్తుండగా నిరంజన్ రెడ్డి అనే వకీల్ పేరు కేసీఆర్ కు స్ఫురణకు వచ్చిందట..

  నిరంజన్ రెడ్డి అంటే మొన్నామధ్య చిరంజీవితో ఆచార్య సినిమా తీశారు కదా ఆయనే. ఆయన అంతకు మించి మంచి వకీల్ కూడా.. మంచి నాలెడ్జ్.. ఢిల్లీలో మంచి రాజకీయ ప‌ట్టు ఉన్న వ్య‌క్తి. అంతేకాదు జగన్ కు సంబంధించిన కేసులు కూడా సుప్రీం కోర్టులో ఆయ‌నే వాదిస్తుంటారు..

  ఈమధ్య జగన్ కు చెందిన పలు కేసులు కోర్టుల్లో క్లియర్ అవుతున్నాయి. దీంతో జగన్ కు కూడా రిలీఫ్ వస్తోంది. ఆయన మీద ఉన్న అవినీతి కేసులు ఒక్కొక్కటి తొలగిపోతుండడంతో ఆయనలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరుగుతున్నాయి. ఇదే ఆనందంలో జగన్ తన లాయర్ నిరంజన్ రెడ్డికి ఏకంగా రాజ్యసభ సీట్ ఇచ్చేసి వకీల్ ను కాస్తా ఎంపీగా ప్రమోట్ చేసేశారు.

  అందుకే ఇపుడు కవిత కూడా నిరంజన్ రెడ్డిని తన తరఫు వకీలుగా నియమించుకుని ఢిల్లీ వెళ్లారని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లోని ప్రభుత్వ పెద్దల మెడకు చుట్టుకున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ నుంచి విముక్తులు కావడానికి అటు జగన్.. ఇటు కేసీఆర్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు.

  ఈ పరిస్థితుల నుంచి తమను గట్టెక్కించేందుకు నిరంజన్ రెడ్డి సరైన వారని భావించి, జగన్ అనుమతి, మద్దతుతోనే కేసీఆర్, కవిత ఇప్పుడు నిరంజన్ రెడ్డిని తమకు సపోర్టుగా తీసుకున్నారని అంటున్నారు. ఆయన తన చాణక్యం, చాతుర్యంతో తమను కేసుల నుంచి బయట పడేస్తారని ఆశతో ఉన్నారు.. చూడాలి మరి.. ఏమి జరుగుతుందో..

  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular

  You cannot copy content of this page