- దొరా.. మీరే గెలిచారు, బహుజనులమైన మేం ఓడిపోయాం!
- జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ శ్రావణి కన్నీరుమున్నీరు
విధాత: కరీంనగర్ జిల్లా జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ శ్రావణి తన పదవికి రాజీనామా చేస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. గత మూడేండ్లుగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ చేస్తున్న వేధింపులను ఇక భరించలేనని మీడియా ముఖంగా బోరున విలపిస్తూ వాపోయారు.
దొరా మీరే గెలిచారు.. బహుజనులమైన మేం ఓడిపోయామని శ్రావణి రోదించారు. ప్రతి చిన్న విషయంలో అయినదానికీ, కానిదానికీ ఎమ్మెల్యే ఎన్ని విధాలుగా వేధింపులకు భరించాననీ చెప్పుకొచ్చారు. తనకూ, తన పిల్లలకూ ముప్పు ఉంటుందని తెలిసినా తప్పటం లేదని కన్నీరు కార్చారు. అయితే నాలుగు రోజుల కిందట చైర్‌పర్సన్‌పై 27 మంది కౌన్సిలర్లు తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే.