Jagtial | జగిత్యాల సూక్ష్మ కళాకారుడి అద్భుత ప్రతిభ విధాత బ్యూరో, కరీంనగర్: జగిత్యాల జిల్లాకు చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్ గుండు పిన్నుపై ఇటీవల భారత దేశ ప్రతిష్టను ఇనుమడింప జేసిన చంద్రయాన్ తోపాటు జీ20 సూక్ష్మ చిత్రాలు రూపొందించి అబ్బురపరిచారు. సూక్ష్మ చిత్ర కళలో ఈయన గౌరవ డాక్టరేట్ సాధించడమే కాక, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించారు. ఈ కళ ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందిన […]

Jagtial |
జగిత్యాల సూక్ష్మ కళాకారుడి అద్భుత ప్రతిభ
విధాత బ్యూరో, కరీంనగర్: జగిత్యాల జిల్లాకు చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్
గుండు పిన్నుపై ఇటీవల భారత దేశ ప్రతిష్టను ఇనుమడింప జేసిన చంద్రయాన్ తోపాటు జీ20 సూక్ష్మ చిత్రాలు రూపొందించి అబ్బురపరిచారు. సూక్ష్మ చిత్ర కళలో ఈయన గౌరవ డాక్టరేట్ సాధించడమే కాక, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించారు.
ఈ కళ ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందిన కళాకారుడు దయాకర్ గణపతి నవరాత్రుల సందర్భంగా గుండు పిన్నుపై చంద్రయాన్ 3, జీ 20 భారతదేశం జెండా పట్టుకుని నిలబడి ఉన్న గణపతిని తయారు చేశారు. ఆరు మిల్లీ మీటర్ల పొడవు, నాలుగు మిల్లీ మీటర్ల వెడల్పుతో ఈ సూక్ష్మ చిత్రాన్ని రూపొందించడానికి ఆయనకు 8 గంటల సమయం పట్టింది.
