విధాత: కోర్టు ధిక్కరణ కేసులో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఈవో ధర్మారెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నెల రోజుల జైలు శిక్షతో పాటు 2వేలు జరిమానా విధించింది. టీటీడీకి చెందిన ముగ్గురు ఉద్యోగుల సర్వీస్ ను క్రమబద్ధీకరించాలని గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేయడం లేదని ముగ్గురు ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు.
కోర్టు ఆదేశాలు అమలు చేయలేదని వాళ్లు ఈవో పై కోర్టు ధిక్కరణ కింద పిటిషన్ వేశారు. ఉద్యోగుల పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు తమ ఆదేశాలను అమలు చేయనందుకు ఈవో ధర్మారెడ్డిపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసి అతనికి జైలు శిక్ష, జరిమానా విధించింది. ఈనెల 27 లోగా ఉద్యోగుల క్రమబద్ధీకరణ తీర్పును అమలు చేయాలని ఆదేశించింది. అయితే ఆదేశాలపై అప్పిల్ కి వెళ్లాలని టీటీడీ నిర్ణయించింది