Jailer vs RCB | తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ నటించిన చిత్రం జైలర్‌. ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రికార్డులను తిరిగరాస్తున్నది. అయితే, ఈ చిత్రం చిక్కుల్లో పడింది. ఐపీఎల్‌లోని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (RCB) జైలర్‌ చిత్ర నిర్మాణ సంస్థ అయిన సన్‌ పిక్చర్స్‌పై కేసు వేసింది. సినిమాలో తమ అనుమతి లేకుండా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జెర్సీని వాడడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే, చిత్రంలోని ఓ సీన్‌లో ఓ కాంట్రాక్ట్‌ కిల్లర్‌ […]

Jailer vs RCB |

తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ నటించిన చిత్రం జైలర్‌. ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రికార్డులను తిరిగరాస్తున్నది. అయితే, ఈ చిత్రం చిక్కుల్లో పడింది. ఐపీఎల్‌లోని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (RCB) జైలర్‌ చిత్ర నిర్మాణ సంస్థ అయిన సన్‌ పిక్చర్స్‌పై కేసు వేసింది.

సినిమాలో తమ అనుమతి లేకుండా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జెర్సీని వాడడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే, చిత్రంలోని ఓ సీన్‌లో ఓ కాంట్రాక్ట్‌ కిల్లర్‌ జెర్సీ వేయడంపై ఆగ్రహించింది ఆర్సీబీ.

అయితే, ఓ మహిళ ఈ జెర్సీ ధరించిన పాత్రధారిని అభ్యంతరకరంగా, అసభ్యకరంగా వ్యాఖ్యలు చేస్తుంది. అలాంటి పాత్రధారికి తమ అనుమతి లేకుండా జెర్సీ వేయడంపై ఢిల్లీ హైకోర్టులో కేసు వేసింది. సన్‌పిక్చర్స్‌ చర్యతో తమ బ్రాండ్‌పై ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొంది.

అయితే, కోర్టు బయటే దీన్ని పరిష్కరించుకునేందుకు మేకర్స్‌ ముందుకురావడం గమనార్హం. జైలర్‌ మూవీలోని ఈ సీన్‌ను మారుస్తామని ఆర్‌సీబీకి హామీ ఇచ్చింది. థియేటర్లలో ఈ సీన్‌ను సెప్టెంబర్‌ ఒకటిలోగా మార్చాల్సి ఉండగా.. డిజిటల్‌, టీవీ ప్లాట్‌ఫామ్స్‌లోనూ సీన్‌ను మార్చేందుకు సన్‌ పిక్చర్స్‌ అంగీకరించింది.

అయితే, చిత్రంలో రజనీకాంత్‌ను చూపేందుకు కాంట్రాక్ట్‌ కిల్లర్‌ పాత్రధారి ప్రయత్నిస్తుంటాడు. చివరకు అతడే చనిపోతాడు. ఓ కాంట్రాక్ట్ కిల్లర్‌కు తమ జట్టు జెర్సీ వేయడం ద్వారా బ్రాండ్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆర్‌సీబీ వాదించింది.

సీన్‌ను మార్చేందుకు మార్చేందుకు మేకర్స్‌ ముందుకురావడంతో సెప్టెంబర్‌ ఒకటిలోగా ఆ మార్పులు చేయాలని కోర్టు ఆదేశించింది. ఆ తర్వాత థియేటర్లు, డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌లోనూ ఆర్సీబీ జెర్సీ కనిపించకూడదని స్పష్టం చేసింది.

Updated On 29 Aug 2023 3:10 AM GMT
cm

cm

Next Story