విధాత‌: మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చిరు తనదైన మార్క్ డాన్స్, ఫైట్స్, యాక్షన్ సీన్స్ లో మెప్పించాడు. చాలా రోజుల తర్వాత రిక్షావోడు, ముఠామేస్త్రి, ఘరానా మొగుడు మార్క్ కామెడీతో నవ్వులు పూయించారు. మ‌రీ ముఖ్యంగా సోషల్ మీడియా ట్రెండ్‌ను పట్టుకోవడంలో చిరంజీవితో పాటు బాబి కూడా సక్సెస్ అయ్యాడు. చాలా సీరియస్ గా సాగిపోతున్న సినిమాలో బలవంతంగా చూపించినట్లు కాకుండా […]

విధాత‌: మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చిరు తనదైన మార్క్ డాన్స్, ఫైట్స్, యాక్షన్ సీన్స్ లో మెప్పించాడు. చాలా రోజుల తర్వాత రిక్షావోడు, ముఠామేస్త్రి, ఘరానా మొగుడు మార్క్ కామెడీతో నవ్వులు పూయించారు.

మ‌రీ ముఖ్యంగా సోషల్ మీడియా ట్రెండ్‌ను పట్టుకోవడంలో చిరంజీవితో పాటు బాబి కూడా సక్సెస్ అయ్యాడు. చాలా సీరియస్ గా సాగిపోతున్న సినిమాలో బలవంతంగా చూపించినట్లు కాకుండా కామెడీ ట్రాక్‌ను చాలా తెలివిగా చేర్చారు. ఈ ట్రాక్ కి తగినట్టు చిరు తన హావభావాలతో రెచ్చిపోయాడు.

వాల్తేరు వీరయ్య మూవీలోని విలన్ లో ఒకడిగా ఉన్నా బాబీ సింహాన్ని కిడ్నాప్ చేసేందుకు చిరంజీవి సీరియస్ గా స్కెచ్ వేస్తుంటాడు. ఆ టైంలో వెన్నెల కిషోర్ అన‌వ‌స‌ర ప్రశ్నలతో డిస్టర్బ్ చేస్తాడు. దాంతో చిరంజీవి బేసిక్ సెన్స్ ఉండదు. చేసే మూడ్‌, ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. అంటేనేమో అందరికీ కోపం వస్తుంది. అందరూ హర్ట్ అయిపోతారు.. అంటూ తనదైన శైలిలో నవ్వులు పూయించాడు.

చిరంజీవి కామెడీ ట్రాక్ ఫస్ట్ ఆఫ్ అభిమానిని బాగా అలరించింది. మంచు విష్ణు నటించిన జిన్నా మూవీలోని జంబలకడి జారు మిఠాయి పాటని కూడా ఈ మూవీలో చిరంజీవి మద్యం మత్తులో పాడుతూ కనిపిస్తారు. వాస్తవానికి ఈ పాట జిన్నా సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో చిత్తూరు జిల్లా నుండి తీసుకొచ్చిన ఓ మహిళతో మంచు మోహన్ బాబు పాడించాడు.

ఈ పాటపై విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. దాంతో ఆ ట్రెండును ఒడిసి పట్టుకున్నారు బాబి, చిరులు. ఆ ఈవెంట్లో చిత్తూరు జిల్లా మహిళా నేను చీర కడతా చూడు నేను చీర కడతా చూడు నా చీర సాయ చూడకుంటే తీసేస్తా చూడు అని పాడింది. వాల్తేరు వీరయ్య మూవీలో చీర స్థానంలో లుంగీ పదాన్ని యాడ్ చేస్తూ డాన్స్ కూడా చేస్తూ కనిపించారు.

ఇక పోలీస్ స్టేషన్లో రవితేజ ముందు చిరంజీవి పెద్దరికం ప్రదర్శించే సీను కూడా ప్రేక్షకులకు నవ్వు తెప్పిస్తుంది. ఈ సీన్లో చిరంజీవి మూన్ వాక్ చేస్తూ వెనక్కి వెళ్లడం.. ఆ తర్వాత రవితేజకి ఇడియట్ మూవీలోని కమిషనర్ డైలాగ్ తో చిరు ఇచ్చే వార్నింగ్ కూడా ప్రేక్షకులను బాగా అలరిస్తోంది.

Updated On 14 Jan 2023 1:15 PM GMT
krs

krs

Next Story