Saturday, April 1, 2023
More
  HomelatestNTR30: జాన్వీ కపూర్ లుక్ అదిరింది.. ఇక ఊపిరాడనివ్వరట

  NTR30: జాన్వీ కపూర్ లుక్ అదిరింది.. ఇక ఊపిరాడనివ్వరట

  విధాత‌, సినిమా: సాధార‌ణంగా ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ (Koratala Shiva0 అంటే క‌మ‌ర్షియ‌ల్ చిత్రాలు గుర్తుకు వ‌స్తాయి. ఆయ‌న నుంచి సామాజిక సందేశం ఉండే చిత్రాల‌ను అంద‌రూ ఆశిస్తారు. ప్ర‌తి చిత్రంలోనూ ఏదో ఒక సామాజిక స‌మ‌స్య‌ను భుజానికి ఎత్తుకుంటారు.

  ‘మిర్చి, శ్రీ‌మంతుడు, భ‌ర‌త్ అనే నేను, జ‌న‌తా గ్యారేజ్‌’ వంటి చిత్రాల‌లో సామాజిక స‌మ‌స్య‌లే ప్ర‌ధాన‌ పాత్ర పోషిస్తాయి. కానీ, ఆయన దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) క‌లిసి న‌టించిన ‘ఆచార్య (Acharya)’ చిత్రం డిజాస్ట‌ర్ అయింది.

  దీంతో ప్ర‌తి ఒక్క‌రు కొర‌టాల శివ‌ను ఓ విల‌న్‌గా చూస్తున్నారు. ఏ ద‌ర్శ‌కుడూ త‌న చిత్రాన్ని అందునా మెగాస్టార్, మెగాప‌వ‌ర్ స్టార్లు క‌లిసి న‌టించే అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడు దానిని చెడ‌గొట్టుకోరు. ఏ ద‌ర్శ‌కునికి అన్ని చిత్రాలు హిట్ కావు. వాటిల్లో కొన్ని అనూహ్య‌ ప‌రాజ‌యాలు సైతం ఉంటాయి. అన్నింటిని అంద‌రు జ‌డ్జ్ చేయ‌లేరు. అలాగైతే అస‌లు ఫ్లాప్ అనేదే ఉండ‌దు క‌దా!

  తాజాగా ఎన్టీఆర్ (NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసింది. ఇంత‌కుముందు వీరి కాంబినేష‌న్‌లో ‘జ‌న‌తా గ్యారేజ్’ అనే సూప‌ర్ హిట్ మూవీ వ‌చ్చింది. ఇప్పుడు కొరటాలతో తారక్ చేస్తున్న చిత్రం.. తారక్‌కి 30వ చిత్రం. దాంతో ఈ చిత్రాన్ని ఎన్టీఆర్30 అనే వర్కింగ్ టైటిల్‌తో పిలుస్తున్నారు. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవెల్‌లో యువ సుధా, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ (NTR Arts Banner) నిర్మిస్తున్నాయి.

  ఇదిలా ఉంటే ఈ సినిమా ఫిక్షనల్ కథాంశంతో ఉండబోతుందని తెలుస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా ఓ దీవి సెట్‌ను నిర్మిస్తున్నార‌ట‌. సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే ఈ సినిమాలో తారక్ మాస్ అవ‌తారంలో కనిపించ నున్నారట. ఈ నెలలోనే పూజా కార్యక్రమాలు మొదలు పెట్టాలనుకున్నారు. కానీ తారకరత్న మరణంతో ఇది వాయిదా పడింది.

  ఇప్పుడు ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ ఆస్కార్ (RRR Oscar) వేడుకల కోసం యుఎస్ వెళ్తున్నాడు. అనంతరం ఈనెల 20వ తేదీలోపు ఓపెనింగ్ జరిగే అవకాశం ఉంది. అలాగే ఏప్రిల్ మొదటి వారంలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసే ఛాన్స్ ఉందన్న మాట వినిపిస్తోంది. దీనిని దాదాపు కన్ఫామ్ చేశారు. ఈ సినిమాలో శ్రీదేవి (Sridevi) గారాలపట్టి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తోంది.

  జాన్వీ కపూర్ పుట్టినరోజును పురస్కరించుకుని మార్చి 6న అధికారికంగా ఆమె ఈ సినిమాలో నటిస్తున్నట్లుగా ప్రకటించారు. ఆమె లుక్‌ను కూడా రివీల్ చేశారు. రీసెంట్‌గా ఈ సినిమా కోసం ఆమె ఫొటో షూట్ చేసినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అది నిజమే అనేలా.. తాజాగా ఆమె లుక్‌ని మేకర్స్ రివీల్ చేశారు. ఇక వరసబెట్టి.. ఈ సినిమా అప్‌డేట్స్ వదిలేందుకు మేకర్స్ రెడీ అవుతున్నట్లుగా సమాచారం.

  spot_img
  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular