Janhvi Kapoor | అతిలోక‌సుందరి శ్రీదేవి ముద్దుల త‌న‌య జాన్వీ క‌పూర్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ద‌ఢ‌ఖ్ సినిమాతో ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన ఈ అందాల ముద్దుగుమ్మ సినిమాల క‌న్నా కూడా త‌న అందాల ఆర‌బోత‌తో పాటు ప్రేమ వ్య‌వ‌హారంతో హాట్ టాపిక్‌గా మారింది. కొంత కాలంగా జాన్వీ క‌పూర్ ప్రేమాయ‌ణంపై అనేక ప్ర‌చారాలు సాగుతున్నా కూడా ఏ నాడు స్పందించ‌ లేదు. కానీ తాజాగా త‌న తొలి ప్రేమ గురించి స్వ‌యంగా చెప్పుకొచ్చి అంద‌రికి షాక్ ఇచ్చింది. […]

Janhvi Kapoor |

అతిలోక‌సుందరి శ్రీదేవి ముద్దుల త‌న‌య జాన్వీ క‌పూర్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ద‌ఢ‌ఖ్ సినిమాతో ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన ఈ అందాల ముద్దుగుమ్మ సినిమాల క‌న్నా కూడా త‌న అందాల ఆర‌బోత‌తో పాటు ప్రేమ వ్య‌వ‌హారంతో హాట్ టాపిక్‌గా మారింది.

కొంత కాలంగా జాన్వీ క‌పూర్ ప్రేమాయ‌ణంపై అనేక ప్ర‌చారాలు సాగుతున్నా కూడా ఏ నాడు స్పందించ‌ లేదు. కానీ తాజాగా త‌న తొలి ప్రేమ గురించి స్వ‌యంగా చెప్పుకొచ్చి అంద‌రికి షాక్ ఇచ్చింది. జాన్వీ కపూర్ బిజినెస్ ఫ్యామిలీకి చెందిన అక్షత్ రాజన్ అనే వ్యక్తితో తొలిసారి ప్రేమ‌లో ప‌డిన‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది.

మ‌రోవైపు డెబ్యూ మూవీ హీరో ఇషాన్ కట్టర్ తో కూడా సన్నిహితంగా ఉంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. శిఖర్ పహారియా, ఆర్యన్ కార్తీక్, ఒర్హాన్ అవిత్రమని ఇలా పలువురితో ఆమె డేటింగ్ చేశారంటూ క‌థ‌నాలు బీటౌన్ లో సంద‌డి చేశాయి.

అయితే జాన్వీ క‌పూర్ తన ఫ‌స్ట్ ల‌వ్ ఎవ‌ర‌నేది చెప్ప‌లేదు కానీ ఎందుకు ముగింపు ప‌లికిందో చెప్పింది. ఆ స‌మ‌యంలో మా ఇద్దరిలో ఏ మాత్రం పరిణితి లేదు. దీంతో మేమిద్ద‌రం అయోమయానికి గురయ్యాం. మా ప్రేమ అంతా కూడా అబద్దాలతో సాగింది.

మా పేరెంట్స్ చదువు మీద దృష్టి పెట్టమని హెచ్చరించ‌డంతో, వారి మాట వింటే మంచి భవిష్యత్తు ఉంటుందని న‌మ్మి నా తొలిప్రేమకు ముగింపు పలికాను.. అని జాన్వీ కపూర్ స్ప‌ష్టం చేసింది. మొత్తానికి జాన్వీ క‌పూర్ తొలిసారి త‌న ఫ‌స్ట్ ల‌వ్ గురించి ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేయ‌డంతో ఇప్పుడు అంద‌రు కూడా ఆమె ఫ‌స్ట్ ల‌వ్ ఎవ‌రా అని ఆరాలు తీస్తున్నారు.

ఇక జాన్వీ క‌పూర్ తొలిసారి ఎన్టీఆర్ సినిమా దేవ‌ర‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ని కూడా ప‌ల‌క‌రించ‌బోతుంది. గతంలో పలువురు మేకర్స్ జాన్వీని తెలుగు సినిమాల‌లో న‌టింప‌జేసే ప్ర‌య‌త్నాలు చేసిన అది కుద‌ర‌లేదు. ఎట్ట‌కేల‌కి దర్శకుడు కొరటాల శివ ఇది సాకారం చేసి ఎన్టీఆర్ స‌ర‌స‌న న‌టింప‌జేస్తున్నారు.

జూనియ‌ర్ ఎన్టీఆర్ తాత సీనియర్ ఎన్టీఆర్ , జాన్వీ త‌ల్లి శ్రీదేవి జంటగా పదుల సంఖ్యలో చిత్రాలు వచ్చాయి. వారిద్ద‌రు క‌లిసి సిల్వర్ స్క్రీన్ మీద చేసిన అద్భుతం అంతా ఇంతా కాదు. ఇక ఇప్పుడు వారి వారసులైన జాన్వీ కపూర్, ఎన్టీఆర్ మొదటిసారి జ‌త‌క‌డుతుండ‌డంతో ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తారా అని అంద‌రు ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా దేవ‌ర చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్న‌ట్టు స‌మాచారం.

Updated On 8 Sep 2023 8:11 AM GMT
sn

sn

Next Story