Bumrah | భారత ప్రధాన బౌలర్ బుమ్రా గాయంతో కొన్ని నెలల పాటు జట్టుకి దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఇటీవలే ఆయన తిరిగి టీంతో కలిసారు. బుమ్రా సారధ్యంలో భారత జట్టు ఐర్లాండ్‌కి వెళ్లి సిరీస్ గెలుచుకొని వచ్చింది. ఇక ప్రస్తుతం ఆసియా కప్ జరుగుతుండగా, భారత్ తన తొలి మ్యాచ్ పాక్‌తో ఆడగా, ఆ మ్యాచ్‌లో బుమ్రా తన బ్యాట్‌తో అలరించాడు. వర్షం కారణంగా బౌలింగ్ చేసే అవకాశం రాలేదు. ఇక పసికూన నేపాల్‌తో […]

Bumrah |
భారత ప్రధాన బౌలర్ బుమ్రా గాయంతో కొన్ని నెలల పాటు జట్టుకి దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఇటీవలే ఆయన తిరిగి టీంతో కలిసారు. బుమ్రా సారధ్యంలో భారత జట్టు ఐర్లాండ్‌కి వెళ్లి సిరీస్ గెలుచుకొని వచ్చింది. ఇక ప్రస్తుతం ఆసియా కప్ జరుగుతుండగా, భారత్ తన తొలి మ్యాచ్ పాక్‌తో ఆడగా, ఆ మ్యాచ్‌లో బుమ్రా తన బ్యాట్‌తో అలరించాడు.
వర్షం కారణంగా బౌలింగ్ చేసే అవకాశం రాలేదు. ఇక పసికూన నేపాల్‌తో మ్యాచ్‌కు సిద్ధమవుతుండగా, ఈ స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా జట్టుకి దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాలతో అతను స్వదేశం తిరిగి వచ్చాడని, సూపర్-4 మ్యాచ్‌లు ప్రారంభమయ్యే సమయానికి అతను మళ్లీ జట్టుతో కలుస్తాడని వార్తలు వస్తున్నాయి.
అయితే అత్యవసరంగా బుమ్రా స్వదేశానికి తిరిగి రావడంపై అనేక ఊహగానాలు అందరి మదిలో మెదులుతున్నాయి. బుమ్రాకి మళ్లీ గాయమైందా, లేకుంటే బుమ్రా కుటుంబ సభ్యుల్లో ఎవరైన అనారోగ్యానికి గురయ్యారా అంటూ పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే అసలు విషయం ఏంటంటే.. బూమ్ బూమ్ బుమ్రా త్వరలోనే తండ్రి కాబోతున్నాడు. అతని సతీమణి, స్టార్ స్పోర్ట్స్ యాంకర్ సంజనా గణేషన్ త్వరలో బిడ్డకు జన్మనివ్వనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆమె డెలివరీ టైమ్ దగ్గరపడటంతో తన భార్యకి దగ్గర ఉండాలని భావించి బుమ్రా స్వదేశానికి తిరిగి వచ్చాడని తెలుస్తుంది. మరో రెండు రోజులలో బుమ్రా నుండి గుడ్ న్యూస్ అయితే రావడం పక్కా అంటున్నారు.
గతంలో విరాట్ కోహ్లీ కూడా తన సతీమణి అనుష్క శర్మ ప్రసవ సమయంలో భారత జట్టును విడిచి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బుమ్రా కూడా బీసీసీఐ అనుమతితో జట్టుని విడిచి వెళ్లాడు. ఆసియాకప్ సూపర్-4 మ్యాచ్‌లు ప్రారంభమయ్యే సమయానికి బుమ్రా మళ్లీ తిరిగి జట్టుతో కలవనున్నాడని కొందరు చెప్పుకొస్తున్నారు. మరి బుమ్రా అసలు ఎందుకు స్వదేశానికి వచ్చాడు అనే దానిపై రెండు రోజులలో క్లారిటీ రావడం ఖాయం.
