ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని మీర‌ట్‌లో ఘ‌ట‌న‌ Neeraj Chopra | విధాత‌: ఒలింపిక్స్‌లో ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్ విభాగంలో భారత్‌కు తొలి బంగారు పతకం సాధించిన నీరజ్‌ చోప్రా విగ్ర‌హానికి అవ‌మానం జ‌రిగింది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని మీర‌ట్‌లో నీరజ్‌ గౌరవార్థం నిర్మించిన కాంస్య విగ్రహం చేతుల్లోని జావెలిన్‌ (ఈటె) మంగ‌ళ‌వారం రాత్రి చోరీ గురైంది. హా పూర్ బేస్‌లోని స్పోర్ట్స్ సిటీలో ఏర్పాటు చేసిన నీర‌జ్ విగ్రహంలో జావెలిన్ మంగ‌ళ‌వారం ఉద‌యం నుంచి క‌నిపించ‌డం లేదు. నీర‌జ్ విగ్ర‌హంలోని ఈటె చోరీకి […]

  • ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని మీర‌ట్‌లో ఘ‌ట‌న‌

Neeraj Chopra | విధాత‌: ఒలింపిక్స్‌లో ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్ విభాగంలో భారత్‌కు తొలి బంగారు పతకం సాధించిన నీరజ్‌ చోప్రా విగ్ర‌హానికి అవ‌మానం జ‌రిగింది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని మీర‌ట్‌లో నీరజ్‌ గౌరవార్థం నిర్మించిన కాంస్య విగ్రహం చేతుల్లోని జావెలిన్‌ (ఈటె) మంగ‌ళ‌వారం రాత్రి చోరీ గురైంది. హా

పూర్ బేస్‌లోని స్పోర్ట్స్ సిటీలో ఏర్పాటు చేసిన నీర‌జ్ విగ్రహంలో జావెలిన్ మంగ‌ళ‌వారం ఉద‌యం నుంచి క‌నిపించ‌డం లేదు. నీర‌జ్ విగ్ర‌హంలోని ఈటె చోరీకి గురైన వార్త బ‌య‌ట‌కు పొక్క‌డంతో ప్ర‌జ‌లంతా ఖిన్నుల‌య్యారు. నిత్యం ర‌ద్దీగా ఉండే మార్కెట్ మధ్యలో ఉన్న విగ్రహంలోని ఈటెను దొంగ‌లు ఎత్తుకుపోవ‌డంపై విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు.

ఒలింపిక్స్ పురుషుల జావెలిన్ త్రో (ట్రాక్ అండ్ ఫీల్డ్స్ స్పోర్ట్స్)లో భారతదేశానికి మొదటి స్వర్ణం అందించిన నీరజ్ చోప్రా ఘనతను స్మ‌రించుకొనేలా పొడవైన నీర‌జ్ కాంస్య విగ్ర‌హం ఏర్పాటుచేశారు. విగ్ర‌హంలోని ఈటె ఇప్పుడు చోరీకి గురైంది. ఈటె లేని నీర‌జ్ క్యాంస విగ్ర‌హం వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేయ‌గా, వైర‌ల్‌గా మారింది.

Updated On 5 Sep 2023 11:03 AM GMT
somu

somu

Next Story