Shahrukh Khan | jawan తిరుమల: తిరుమల శ్రీవారిని ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ దర్శించుకున్నారు. కుమార్తె సుహానాఖాన్, భార్య గౌరీ ఖాన్, నయనతారతో కలిసి శ్రీవారి సుప్రభాత సేవలో ఆయన పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు షారుఖు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఉదయం తిరుమల శ్రీవారి ఆలయంకు చేరుకున్న వీరు ముందుగా ధ్వజ స్థంభానికి మొక్కి మొక్కులు చెల్లించుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం గర్భాలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. Shahrukh Khan […]

Shahrukh Khan | jawan

తిరుమల: తిరుమల శ్రీవారిని ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ దర్శించుకున్నారు. కుమార్తె సుహానాఖాన్, భార్య గౌరీ ఖాన్, నయనతారతో కలిసి శ్రీవారి సుప్రభాత సేవలో ఆయన పాల్గొన్నారు.

తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు షారుఖు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఉదయం తిరుమల శ్రీవారి ఆలయంకు చేరుకున్న వీరు ముందుగా ధ్వజ స్థంభానికి మొక్కి మొక్కులు చెల్లించుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం గర్భాలయంలో స్వామివారిని దర్శించుకున్నారు.

ఇదిలాఉండగా సెప్టెంబర్ 7న షారుఖ్ నటించిన 'జవాన్' చిత్రం విడుదల కానుంది. ఈక్రమంలోనే వారు శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. స్వామి వారి దర్శనాంతరం రంగనాయకుల మండపంలో ఆలయ పండితులు ఆయనకు వేద ఆశీర్వచనం చేసి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అయితే బాలీవుడ్ నటులను చూసేందుకు అభిమానులు పోటీ పడ్డారు. కాగా హిందువు అయిన గౌరీని షారుఖ్‌ఖాన్‌ ప్రేమించి విమాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమారులు, ఓ కూతురు.

Updated On 5 Sep 2023 3:26 AM GMT
krs

krs

Next Story