Jayalalitha | తెలుగు సినీ ఇండస్ట్రీలో దశాబ్ధకాలంగా తన నటనతో అలరిస్తున్న సీనియర్ నటి జయలలిత. ఎన్నో చిత్రాలలో సపోర్టింగ్ పాత్రలు పోషించిన జయలలిత ఎక్కువగా వ్యాంప్ పాత్రలు పోషించింది. ఆమె నటనకి మంచి మార్కులే పడ్డాయి. అయితే వ్యాంప్ పాత్రలే కాక కొన్ని పవర్ ఫుల్ పాత్రలలోను ఆమె నటించి మెప్పించింది. మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్రంలో అసెంబ్లీ స్పీకర్ పాత్రలో నటించి అందరిని ఆశ్చర్యపరిచింది జయలలిత. అయితే ఎప్పుడు కనిపించిన […]

Jayalalitha |
తెలుగు సినీ ఇండస్ట్రీలో దశాబ్ధకాలంగా తన నటనతో అలరిస్తున్న సీనియర్ నటి జయలలిత. ఎన్నో చిత్రాలలో సపోర్టింగ్ పాత్రలు పోషించిన జయలలిత ఎక్కువగా వ్యాంప్ పాత్రలు పోషించింది. ఆమె నటనకి మంచి మార్కులే పడ్డాయి. అయితే వ్యాంప్ పాత్రలే కాక కొన్ని పవర్ ఫుల్ పాత్రలలోను ఆమె నటించి మెప్పించింది. మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్రంలో అసెంబ్లీ స్పీకర్ పాత్రలో నటించి అందరిని ఆశ్చర్యపరిచింది జయలలిత.
అయితే ఎప్పుడు కనిపించిన కూడా చాలా సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తుంది జయలలిత. కాని ఆమె జీవితంలో చాలా కష్టాలు ఉన్నాయి. వాటి గురించి పలు సందర్భాలలో చెప్పుకొచ్చింది. తాజా ఇంటర్వ్యూలో తనకు వచ్చిన అవకాశాలు జారిపోకుండా ఉండి ఉంటే మంచి పొజిషన్‌లో స్టార్ హీరోయిన్‌గా ఉండేదానిని అని పేర్కొంది.
మెగాస్టార్ చిరంజీవికి సూపర్ హిట్ అందించిన ఖైదీ చిత్రంలో సుమలత పోషించిన పాత్రని ముందుగా జయలలితకే ఇచ్చారు. తిరుపతి రెడ్డి గారు అమ్మాయి బాగుంది.. ఖైదీ చిత్రంలో ఒక క్యారెక్టర్ ఇవ్వాలని అనుకున్నారట. కానీ ఆ తర్వాత ఏమైందో తెలియదు ఆ పాత్ర సుమలతకి వెళ్ళిపోయిందని జయలలిత స్పష్టం చేసింది.
ఆ తర్వాత పలు చిత్రాల్లో హీరోయిన్ గా అవకాశాలు వచ్చినట్లే వచ్చి చేజారాయని ఆమె తెలిపింది. అయితే తను వ్యాంప్ పాత్రలు కావాలని ఏమి చేయలేదని, హీరోయిన్ గా అవకాశాలు చేజారుతున్న నేపథ్యంలో చిన్న పాత్రలని సైతం అంగీకరించాల్సిన పరిస్థితి వచ్చిందంటూ ఆమె చెప్పుకొచ్చింది.
తమ ఫ్యామిలీలో ఐదుగురు తోబుట్టువులు ఉండగా, వారి పిల్లలతో కలిపి మొత్తం 14 మంది ఉన్నారని, వారందరికి ఆదాయ మార్గం ఏమి లేకపోవడంతో అందరి భారం తనపైనే ఉండేదని, అలాంటి సమయంలో వ్యాంప్ పాత్రలని పోషించేందుకు కూడా అంగీకరించాల్సి వచ్చిందని జయలలిత తాజాగా ఇంటర్వ్యూలో తెలియజేసింది.
నాకు 23 ఏళ్ల వయస్సులో వ్యాంప్ అంటే తెలియదు. అప్పుడు దర్శకుడు ఐవి శశి.. కమల్ హాసన్ చిత్రంలో వ్యాంప్ తరహాలో ఒక పాత్ర ఉంటుందని తెలియజేశారు. అది కమల్ హాసన్ చిత్రం కావడంతో ఒకే చెప్పేశా. అలా అప్పటి నుంచి నాకు వరుసగా వ్యాంప్ పాత్రలు పలకరించాయని జయలలిత పేర్కొంది. కుటుంబ భారాన్ని మోసేందుకు.. తప్పని పరిస్థితుల్లో వ్యాంప్ పాత్రలు చేయాల్సి వచ్చిందని చెబుతూ జయలలిత చాలా ఎమోషనల్ అయింది.
