విధాత: చాలా చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చిన జయసుధ ఆ తర్వాత స్టార్ హీరోల సరసన ఎన్నో చిత్రాలలో నటించింది. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి వారితో పలు చిత్రాలు చేసిన ఈమె తాజాగా వారసుడు చిత్రంలో హీరో విజయ్ కి తల్లి పాత్రలో నటించింది. కొన్ని రోజులుగా ఈమె వివాహం చేసుకోబోతోందని వార్తలు వచ్చాయి. ఆమె అలీ కూతురు ఫంక్షన్ లో వారీసు వేడుకలో ఒక వ్యక్తితో కలిసి వాటికి హాజరయ్యింది. అంతేకాదు అతనితో కలిసి పలు వేడుకలకు వచ్చిన ఆమెను మీడియా వారు ఓ బిజినెస్ మాన్ తో 64 ఏళ్ల జయసుధ వివాహం చేసుకోనుందని పుకార్లు షికార్లు చేయించారు.
తాజాగా ఆమె ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ అతను నా స్నేహితుడు. అమెరికా నుండి వచ్చాడు. నా బయోపిక్ తీసేందుకు అన్ని దగ్గరుండి గమనిస్తున్నాడు. అతని పేరు పిలిపే రూయెల్స్. అతను నేను ఒక సినిమా కొలాబరేషన్ కి కలిసాము. నా బయోపిక్ తీస్తున్నారు. ఇది స్పిర్చువల్ బయోపిక్ అంటే నేను క్రిస్టియానిటీ లోకి ఎలా మారాను? ఎప్పుడు మారాను? ఆ తర్వాత ఏంటి? అలా మారక ముందు నేను ఎలా ఉండే దాన్ని? ఇవన్నీ బయోపిక్ లో ఉంటాయని జయసుధ తెలియజేసింది.
అతను నా గురించి రీసర్చ్ చేసేటప్పుడు ఇంటర్నెట్ ఇతను మాధ్యమాలలో నా గురించి తెలుసుకున్నాడు. దాంతో ఇక్కడ నాకు ఎలాంటి ఫాలోయింగ్ ఉంది.. అందరూ నన్ను ఎలా గౌరవిస్తారు.. నా సినిమాల షూటింగులు అవి ఎలా ఉంటాయి.. ఇవన్నీ తెలుసుకునేందుకు నాతో కలిసి వస్తున్నాడు.. అంతకుమించి ఇంకేమీ లేదు. నేను అమెరికా వెళ్ళినప్పుడు అతడిని కలిశానని నా కొడుకుతో సినిమా తీసినప్పుడు ఆ సినిమా స్క్రీనింగ్ కు ఆహ్వానిస్తే అమెరికా వెళ్లినట్లు క్లారిటీ ఇచ్చింది. అయితే ప్రస్తుతం అతని కొడుకు కూడా జయసుధతో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నాడని సమాచారం.
కొన్ని సంవత్సరాల కిందట బ్యాంకాక్ లో నీటిలో జయసుధ పడిపోయింది. నీటి అడుగుకి వెళ్లిన ఏమీ కాకుండా కనీసం ముక్కులోకి కూడా నీరు పోకుండా బయటపడింది. అప్పుడు జయసుధకి జీసస్ కనిపించారు. అది ఒక మిరాకిల్.. సూపర్ నేచురల్ పవర్ నన్ను కాపాడింది అని జయసుధ చెప్పుకొచ్చింది ఈ మిరాకిల్ ఆధారంగానే ఈ స్పిర్చువల్ బయోపిక్ తీసుకున్నట్టు జయసుధ చెప్పుకొచ్చింది.