Friday, February 3, 2023
More
  Homelatestమించి పోతున్న ‘జాన్వీ’

  మించి పోతున్న ‘జాన్వీ’

  విధాత: అలనాటి అందాల తార శ్రీదేవి ముద్దుల కూతురు జాహ్నవి కపూర్ ఈ మధ్య ఎక్స్‌ఫోజింగ్‌లో శృతి మించి పోతున్నది. తల్లి శ్రీదేవి ఉన్నన్ని రోజులు కొంగుచాటు బిడ్డలా ఉన్న జాన్వీ ఇప్పుడు ఈ లెవల్లో దర్శనమిస్తుండడంతో శ్రీదేవి అభిమానులు, నెటిజన్లు ఓ రకంగా షాక్‌కు గురవుతున్నారు.. మరి కొందరు ఆ ఫొటోలను చూసి తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు.

  ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో నటుడు విజయ్ దేవరకొండతో డేటింగ్ చేయడానికి ఇష్టపడతానని చెప్పి మీడియాను ఒక్కసారిగా తన వైపుకు తిప్పుకున్న ఈ అమ్మడు శ్రీదేవి లెక్కనే అప్పుడప్పుడు సాంప్రదాయ దుస్తుల్లో.. తరుచూ ఫ్యాషన్ డ్రెస్‌ల్లో తన అందాలన్నీ ఆరబోస్తూ యువకులకు నిద్ర లేకుండా చేస్తుంది.

  గతంలో రామ్ గోపాల్‌వర్మ శ్రీదేవి కోసం అమ్మ బ్రహ్మ దేవుడో పాట రాయించినట్టే.. ఈ ముద్దుగుమ్మ కోసం వామ్మో బ్రహ్మ దేవుడో అంటూ కవులు మళ్లీ అలాంటి పాట ఒకటి రాయాలనిపించేలా.. జాహ్నవి తన గ్లామర్‌తో కుర్రకారును మత్తెక్కిస్తోంది.

  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular