విధాత: ఇక నుంచి ల్యాప్‌టాప్ అగ్గువ ధ‌ర‌కే ల‌భించ‌నుంది. 4జీ సిమ్ కార్డుతో రానున్న ఈ ల్యాప్‌టాప్ ధ‌ర‌ను రూ.15 వేలకు విక్ర‌యించాల‌ని దేశీయ టెలికం రంగ దిగ్గ‌జ సంస్థ రిల‌య‌న్స్ జియో ప్ర‌క‌టించింది. జియో బుక్ పేరుతో ల్యాప్‌టాప్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తున్న‌ట్లు తెలుస్తోంది. స్థానికంగా జియో బుక్‌ను ఉత్ప‌త్తి చేసేందుకు ఫ్లెక్స్ అనే సంస్థ‌తో కాంట్రాక్ట్ కుదిరిన‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే అతి త‌క్కువ ధ‌ర‌లో ల‌భించే జియోఫోన్‌ను మార్కెట్‌లోకి రిల‌య‌న్స్ విడుద‌ల చేసిన […]

విధాత: ఇక నుంచి ల్యాప్‌టాప్ అగ్గువ ధ‌ర‌కే ల‌భించ‌నుంది. 4జీ సిమ్ కార్డుతో రానున్న ఈ ల్యాప్‌టాప్ ధ‌ర‌ను రూ.15 వేలకు విక్ర‌యించాల‌ని దేశీయ టెలికం రంగ దిగ్గ‌జ సంస్థ రిల‌య‌న్స్ జియో ప్ర‌క‌టించింది. జియో బుక్ పేరుతో ల్యాప్‌టాప్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

స్థానికంగా జియో బుక్‌ను ఉత్ప‌త్తి చేసేందుకు ఫ్లెక్స్ అనే సంస్థ‌తో కాంట్రాక్ట్ కుదిరిన‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే అతి త‌క్కువ ధ‌ర‌లో ల‌భించే జియోఫోన్‌ను మార్కెట్‌లోకి రిల‌య‌న్స్ విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా త‌క్కువ ధ‌ర‌కే ల్యాప్‌టాప్‌ను తీసుకొచ్చేందుకు రిల‌య‌న్స్ ప్ర‌య‌త్నిస్తోంది.

జియో బుక్ పేరుతో తేనున్న ల్యాప్‌టాప్‌.. జియో సొంత ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ తోనే ప‌ని చేయ‌నున్న‌ది. యాప్స్ అన్ని కూడా జియో స్టోర్ నుంచి డౌన్లోడ్ అవుతాయి. మొత్తానికి వచ్చే ఏడాది మార్చికల్లా మార్కెట్‌లో ‘జియో బుక్‌’ మోత మోగించాలన్న లక్ష్యంతో రిలయన్స్‌ అడుగులేస్తున్నది.

అనంతరం జియో ఫోన్‌ 5జీని పరిచయం చేయాలని కంపెనీ భావిస్తున్నట్టు చెప్తున్నారు. గత ఏడాది ఆఖర్లో విడుదలైన దగ్గర్నుంచి ఇప్పటిదాకా రూ.8 వేల లోపు ధర కలిగిన స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాల్లో జియో ఫోనే అగ్ర స్థానంలో ఉన్నట్టు మార్కెట్‌ వర్గాలు చెప్తున్నాయి. దేశవ్యాప్తంగా జియోకు 42 కోట్ల వినియోగదారులున్న సంగతి విధితమే.

Updated On 4 Oct 2022 3:37 AM GMT
subbareddy

subbareddy

Next Story