Saturday, January 28, 2023
More
    Homelatestతరుముకొస్తున్న మాంద్యం.. ఐటీ కంపెనీల్లో కొలువులు కట్!

    తరుముకొస్తున్న మాంద్యం.. ఐటీ కంపెనీల్లో కొలువులు కట్!

    ఖర్చులు తగ్గించాలంటున్న ఆర్థిక నిపుణులు

    విధాత: రోజులన్నీ ఒకేలా ఉండవు.. కొన్ని రోజులు మొత్తం ఆనందాల వెల్లువ ఉంటే ఇంకొన్ని రోజులు గడ్డు రోజులే ఉంటాయి. గత కొన్నేళ్లుగా సాఫ్ట్ వేర్, ఇతర సర్వీస్, ఉత్పత్తి రంగాలు అద్భుతమైన ప్రగతిలో ఉంటూ వస్తున్నాయి. లక్షల్లో ఉద్యోగాలు పుట్టుకొచ్చాయి.. సాధారణ స్కిల్స్ ఉన్న కుర్రాళ్ళు సైతం సాఫ్ట్ వేర్ రంగంలోకి వెళ్లి లక్షల జీతాలతో కొలువులు కొట్టారు. కానీ కోవిడ్ అనంతరం పరిస్థితులు మారాయి.

    మళ్ళీ మాంద్యం వస్తుందని ఆర్థిక, పలు రంగాల్లోని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డబ్బు జాగ్రత్త, ఖర్చులు తగ్గించుకోండి అని సలహాలు ఇస్తున్నారు. అమెజాన్, ట్విట్టర్, కాగ్నిజెంట్ వంటి సంస్థలు వేలల్లో ఉజ్జోగాలు తగ్గిస్తున్నాయ్.. రానున్న రోజులు కష్టమే అన్న హెచ్చరికలు వస్తున్నాయి. సాఫ్ట్ వేర్ రంగం మరోసారి కుదుపునకు గురయ్యే ప్రమాదాలూ ఉన్నాయంటున్నారు.

    ఇప్పటికే అమెరికా, బ్రిటన్ జర్మనీ ఇతర యూరోపియన్ దేశాలు ఆర్థిక మాంద్యం తరహా పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలో కొన్ని దేశాల ప్రధాన బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుకుంటూ పోతున్నాయి. అధిక ద్రవ్యోల్బణంతో పలు దేశాలు కొట్టుమిట్టాడుతున్నాయి. మాంద్యం ముప్పు ఆదాయం తగ్గడంతో కంపెనీలన్నీ కూడా ఉద్యోగులను తొలగిస్తున్నారు.

    ఇప్పటికే అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ప్రపంచ వ్యాప్తంగా మాంద్యం మేఘాలు ముసురుకున్నాయని.. డబ్బులు దాచుకోవాలని.. ఎవరూ అనవసరంగా టీవీలు ప్రీజ్ లు కొనవద్దని పిలుపునిచ్చారు. అమెజాన్ ఏకంగా 10వేల మంది ఉద్యోగులను తొలగించింది. ఇప్పుడు సిస్కో కంపెనీ కూడా అదే బాటలో ఉంది. తాజాగా ట్విట్టర్ ను కొనుగోలు చేసిన ఎలాన్ మస్క్ అయితే వేల మందిని తీసేశారు.

    మిగతా వారికి కూడా ఎక్కువ పని చేయండి, తక్కువ జీతాలు తీసుకోండి అంటూ మెయిల్స్ పెడుతున్నారు. రోజుకు 12 గంటలు పని చేసేందుకు రెడీగా ఉండాలని ఎలాన్ మస్క్ అల్టిమేటం జారీ చేశారు. మున్ముందు పరిస్థితులు ఎలా ఉంటాయోనని సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ భయపడుతున్నారు.

    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular