- ప్రతిపక్షాల డిమాండ్.. ఈడీ కార్యాలయానికి ర్యాలీ
- అడ్డుకున్న పోలీసులు
విధాత: అదానీ (Adani-Hindenburg issue) వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని నియమించాలని కోరుతున్నా కేంద్రం పట్టించుకోకపోవడం లేదని ప్రతిపక్షాలు ఆరోపించాయి. జేపీసీ (Joint Parliamentary Committee (JPC)) వేయాలని డిమాండ్ చేస్తూ పార్లమెంటు నుంచి ఈడీ (Enforcement Directorate)కార్యాలయానికి ర్యాలీగా వెళ్లాలని నిర్ణయించాయి. అదానీ అంశంపై ఈడీకి ఫిర్యాదు చేసేందుకు విపక్షాలు యత్నించాయి.
విపక్ష ఎంపీలు ప్లకార్డు తీసుకుని బయలుదేరగా.. విజయ్ చౌక్‌లో భారీగా మోహరించిన పోలీసులు ర్యాలీని అడ్డుకున్నారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున వెనక్కి వెళ్లిపోవాలని కోరారు. 200 మంది ఎంపీల2000 మంది పోలీసులతో అడ్డుకుని, విపక్షాల గొంతు నొక్కడానికి కేంద్రం యత్నిస్తున్నదని రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే విమర్శించారు.
జేపీసీ వేయడానికి సిద్ధంగా లేనివారు శాంతియుతంగా చేపట్టిన ర్యాలీని ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. ఈ ఉదంతంపై టీవీ చర్చల్లో లేదా ఏదైనా సెమినార్‌లో మాట్లాడితే వారని దేశ వ్యతిరేకులుగా ప్రచారం చేస్తున్నారు. ఈ ర్యాలీలో బెంగాల్ సీఎం మమతాబెనర్జీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పాల్గొనలేదు.
అదానీ సంస్థ తన విలువ పెంచుకోవడానికి షెల్ కంపెనీలను స్టాక్‌మార్కెట్‌ను పక్కదోవ పట్టించింది అని, ఆర్థిక మోసానికి పాల్పడిందని హిండెన్‌బర్గ్ నివేదికలో వెల్లడించింది. దీన్ని అదానీ ఖండిస్తూ ఇది ద్వేషపూరిత, ఆధారహిత ఆరోపణలని భారతదేశంపై దాడిగా అభివర్ణించింది.
ఈ వ్యవహారంతో స్టాక్ మార్కెట్‌లో తెలెత్తే సమస్యలను పరిశీలించడానికి సుప్రీంకోర్టు ఆరుగురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని నియమించింది. స్టాక్‌మార్కెట్ అదానీ షేర్ల పతనంపై లోతైన అధ్యయనం చేయాలని, మదుపరుల రక్షణకు తీసుకోవాల్సిన మరిన్ని జాగ్రత్తలు సిఫార్సు చేయాలని కమిటీని ఆదేశించింది. రెండు నెలల్లో సీల్డ్ కవర్‌లో నివేదిక సమర్పించాలని సుప్రీం స్పష్టం చేసింది. దీనిపై సెబీకి ఇప్పటికే విచారణ జరుపుతున్నదని, దాన్నే కొనసాగించాలని, పురోగతిని కోర్టు తెలియజేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.
రెండో దఫా బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన గత మూడురోజులుగా అదాని అంశంపై జేపీసీ వేయాలని విపక్షాలు … లండన్ కేంబ్రిడ్జి యూనివర్సిటీలో రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని అధికార విపక్షాల మధ్య వాగ్వాదాలు జరుగుతున్నంగా. ఇరుపక్షాలు వెల్‌లోకి దూసుకొస్తుడంతో ఉభయ సభలు పదే పదే వాయిదాపడుతున్నాయి.