పదోసారి చాంపియన్‌గా నిలిచిన సెర్బియన్.. ఈ విజయంతో వరల్డ్ నంబర్ వన్‌గా నిలిచిన చాంపియన్ 22వ గ్రాండ్ స్లామ్ విక్టరీతో నడాల్ రికార్డు సమం.. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సరికొత్త చరిత్ర.. హార్డ్ కోర్టులో తనకు ఎదురేలేదని మరోసారి నిరూపించిన సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్.. గ్రాండ్ స్లామ్ విజయాల్లో స్విస్ స్టార్ ఫెడరర్.. స్పెయిన్ దిగ్గజం నడాల్ ను మించి రాణిస్తూ టెన్నిస్ ప్రపంచంలో ధృవతారగా నిలిచే మహత్తర విజయాలతో దూసుకుపోతూ టెన్నిస్ ప్రపంచానికి తిరుగులేని రారాజుగా […]

  • పదోసారి చాంపియన్‌గా నిలిచిన సెర్బియన్..
  • ఈ విజయంతో వరల్డ్ నంబర్ వన్‌గా నిలిచిన చాంపియన్
  • 22వ గ్రాండ్ స్లామ్ విక్టరీతో నడాల్ రికార్డు సమం..

ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సరికొత్త చరిత్ర.. హార్డ్ కోర్టులో తనకు ఎదురేలేదని మరోసారి నిరూపించిన సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్.. గ్రాండ్ స్లామ్ విజయాల్లో స్విస్ స్టార్ ఫెడరర్.. స్పెయిన్ దిగ్గజం నడాల్ ను మించి రాణిస్తూ టెన్నిస్ ప్రపంచంలో ధృవతారగా నిలిచే మహత్తర విజయాలతో దూసుకుపోతూ టెన్నిస్ ప్రపంచానికి తిరుగులేని రారాజుగా అవతరించాడు. రికార్డు స్థాయిలో పదోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ సాధించి ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ను మరోసారి అందుకున్నాడు.

విధాత: అనుకున్నట్లే అయింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ కు తిరుగులేదని మరోసారి రుజువైంది. ఆదివారం గ్రీస్ ప్లేయర్ స్టెఫనోస్ సిట్సిపాస్ తో జరిగిన టఫ్ ఫైట్ లో 6-3, 7-6(7/4), 7-6(7/5) తేడాతో జొకోవిచ్‌ అద్భుత విజయం సాధించి రికార్డు స్థాయిలో పదోసారి చాంపియన్ గా నిలిచాడు. కళ్లు చెదిరే స్మాష్‌లు.. రాకెట్ వేగంతో సంధించిన పిడుగుల్లాంటి సర్వీస్‌లు.. తిరుగులేని ఫోర్ హ్యాండ్.. బ్యాక్ హ్యాండ్ షాట్లతో ప్రత్యర్థి సిట్సిపాస్ ను కంగు తినిపించాడు.

తొలిసెట్ ఆరంభంలోనే జొకోవిచ్ వేగంగా ఆడుతూ సిట్సిపాస్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. సూపర్ స్మాష్‌లు.. కళ్లు చెదిరే షాట్లతో వరుస పాయింట్లు సాధిస్తూ 6-3తో తొలిసెట్‌ను సాధించాడు. రెండో సెట్‌లో పుంజుకున్న సిట్సిపాస్.. జొకోవిచ్‌ను అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. వరుసగా పాయింట్లు సాధిస్తూ సెట్ స్కోరు 6-6తో సమం చేసి సెట్ ను ట్రైబ్రేక్ దిశగా మళ్లించాడు.

కానీ కచ్చితమైన సర్వీసులతో అదరగొట్టిన జొకోవిచ్.. సిట్సిపాస్ పోరాటాన్ని అడ్డుకుని రెండోసెట్ నూ కైవసం చేసుకున్నాడు. హోరాహోరీగా సాగిన మూడో సెట్ సైతం ట్రేబ్రేక్ లోకి వెళ్లినా మరోసారి జొకోవిచ్ అద్భుతమైన సర్వీసులతో సెట్ తోపాటు మ్యాచ్ ను గెలుచుకుని చాంపియన్ గా నిలిచాడు.

బేస్ లైన్ పై ప్రత్యర్థిని దీటుగా ఎదుర్కొన్నా.. సర్వీసులో విఫలం కావడంతో సిట్సిపాస్ రన్నరప్ గా నిలిచి మరోసారి గ్రాండ్ స్లామ్ చాంపియన్ గా నిలిచే అవకాశం కోల్పోయాడు.

నడాల్ రికార్డు సమం..

జొకోవిచ్‌ కెరీర్‌లో ఇది 10 వ ఆస్ట్రేలియా ఓపెన్‌ టైటిల్‌ కావడం విశేషం. ఇక ఓవరాల్‌గా జొకోవిచ్‌ కెరీర్‌లో ఇది 22 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌. తద్వారా ఓ అరుదైన ఘనతను జొకోవిచ్‌ అందుకున్నాడు. అత్యధిక గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్స్‌ సాధించిన నడాల్(22) రికార్డును జొకోవిచ్‌ సమం చేశాడు. అదే విధంగా తాజా విజయంతో ప్రపంచ నెం1గా జొకోవిచ్‌ అవతరించాడు.

Updated On 29 Jan 2023 2:33 PM GMT
CH RAJITHA

CH RAJITHA

Next Story