విధాత: రాజస్థాన్ ముఖ్యమంత్రిగా కొనసాగుతోన్న అశోక్ గెహ్లాట్.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేయనున్నారు. దీంతో రాజస్థాన్ తదుపరి సీఎం ఎవరనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే సీఎం రేసులో రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషి ఉన్నట్లు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత సీఎం అశోక్ గెహ్లాట్ కూడా సీపీ జోషి పేరును సిఫారసు చేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఒకరికి ఒకే పదవి వర్తిస్తుందని అశోక్ గెహ్లాట్‌తో సోనియా చెప్పినట్లు తెలుస్తోంది. […]

విధాత: రాజస్థాన్ ముఖ్యమంత్రిగా కొనసాగుతోన్న అశోక్ గెహ్లాట్.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేయనున్నారు. దీంతో రాజస్థాన్ తదుపరి సీఎం ఎవరనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే సీఎం రేసులో రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషి ఉన్నట్లు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుత సీఎం అశోక్ గెహ్లాట్ కూడా సీపీ జోషి పేరును సిఫారసు చేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఒకరికి ఒకే పదవి వర్తిస్తుందని అశోక్ గెహ్లాట్‌తో సోనియా చెప్పినట్లు తెలుస్తోంది. సోనియాను గెహ్లాట్ కలిసిన తర్వాతే ఈ పరిణామం చోటు చేసుకుంది.
నేను ఎక్కడ ఉండాలనేది సమయమే నిర్ణయిస్తుందని అశోక్ గెహ్లాట్ అన్నారు. నా వల్ల పార్టీకి లాభం చేకూర్చే చోటే ఉండాలనుకుంటున్నాను, నేను వెనక్కి తగ్గను అని గెహ్లాట్ స్పష్టం చేశారు. 22 ఏండ్ల తర్వాత తొలిసారి అధ్యక్ష ఎన్నికలను నిర్వహించేందుకు కాంగ్రెస్ సన్నాహాలు చేస్తోంది. ఈ అధ్యక్ష ఎన్నికల్లో అశోక్ గెహ్లాట్, శశిథరూర్ పోటీ పడుతున్నారు.
ఎవరీ సీపీ జోషి..?
అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషి.. రాజస్థాన్‌లోని రాజ్‌సమంద్ జిల్లాలోని కున్వారియా గ్రామంలో జన్మించారు. సైకాలజీలో డాక్టరేట్ పట్టా పుచ్చుకున్నారు. న్యాయ శాస్త్రంలో డిగ్రీ పొందారు. రాజస్థాన్ మాజీ సీఎం మోహన్ లాల్ సుఖాడియా జోషిని రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. లెక్చరర్‌గా పని చేస్తున్న జోషిని.. సుఖాడియా తన ఎన్నికల ప్రచారానికి నియమించుకున్నారు.
ఆ సమయంలో మోహన్ లాల్ భారీ మెజార్టీతో గెలుపొందారు. దీంతో 1980లో జోషికి సుఖాడియా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. తొలిసారే ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పుడు ఆయన వయసు కేవలం 29 ఏండ్లు మాత్రమే. సీపీ జోషి 2008లో రాజస్థాన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా పని చేశారు.
